దేశవ్యాప్తంగా ఆందోళనలు
దేశవ్యాప్తంగా ఆందోళనలు
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యపై దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు..., మహిళ సంఘాలు..., ప్రజాసంఘాలు ఆందోళనలు నిరసనలు చెపట్టాయి. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు ప్రజలు. అంతే కాకుండా ఢిల్లీ, బెంగుళూరు, చెన్నైలోనూ నిరసన ప్రదర్శనలు చెపట్టారు. దేశంలోని ప్రముఖులు సోషల్ మీడియాలో డాక్టర్ ప్రియాంక హత్యను నిరసిస్తూ తమ గళం వినిపించారు. నిర్భయ తరహాలో...నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు జనం. చిన్నాపెద్దా తేడా లేదు. స్కూల్ పిల్లల నుంచి యూనివర్సిటీల వరకూ. తరగతులు బహిష్కరించి ఆందోళనలు చేపట్టారు . జస్టిస్ ఫర్ ప్రియాంక పేరుతో ర్యాలీలు నిర్వహించారు.