దేశంలో కరోనా కష్టాలు.

దేశంలో కరోనా కష్టాలు. 

నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు.

22ఆదివారం జనతా కర్ప్యూ - ప్రదాని

 

          దేశంలో కరోనా కష్టాలు పెరుగుతున్నాయి. రోజు రోజు కు దేశంలో కేసులు సంఖ్య పెరుగుతుండటంతో అలెర్టు అయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసకుంటున్నాయి. దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా ఉండటంతో యావత్ జాతి అప్రమత్తంగా ఉండాలని ప్రదాని నరేంద్రమోడి పిలుపు నిచ్చారు. ప్రపంచ యుద్దాలకు మించిన ప్రభావాన్ని కరోనా వైరస్ చూపుతుందన్న ప్రదాని దానిని ఎదుర్కోనేందుకు ప్రజలందరి సహకరం లేకపోతే  దానిని ఎదుర్కోవడం  కష్టమౌతుందన్నారు మోడి. మందు లేని ఈ రోగం ఎదుర్కోవడం సామాజిక దూరం ద్వారానే సాధ్యమౌతుందన్నారు. అందుకోసం ఈ నెల 22 ఆదివారం రోజు ఉదయం 7గంటల నుండి 9గంటల వరకు ప్రజలందరూ ఇల్లలో ఉండే జనతా కర్ప్యూ  పాటించాలని కోరారు.

 

              ఇక దేశంలో కేసుల సంఖ్య 200చెరగా..., దేశంలో 5మంది మరణించారు. అనేక రాష్ట్రాల్లో వివిధ దేశాలనుండి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. వారిని గుర్తించి వారు కలిసిన వారిని కూడా క్వారెంటైన్ చేస్తున్నారు. గతంలో ఇండియాకు వచ్చిన వారని గుర్తించి వారు ప్రస్తుతం ఎలా ఉన్నారు. వారితో కలిసిన వారు ఎలా ఉన్నారనే అంశాలను పరిశీలిస్తూ రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.  

               తప్పని సరి అయితేనే బయటకి రావాలని పిలుపునిచ్చాయి ప్రభుత్వాలు. స్కూల్స్..., మాల్స్ ను మూసివేయ్యాలని నిర్ణయించారు. ఫంక్షన్లు... మీటింగులకు స్వస్తి చెప్పారు. వ్యాపారాలు కుంటుపడుతున్నాయి. దేశంలో స్టాక్ మార్కెట్లు భారీగా పథనం అయ్యాయి.

 

                   దేశంలోని ప్రదాన దేవాలయాలు కూడా భక్తులను అనుమతించడం లేదు. ప్రపంచంలోని ప్రముఖ   కేంద్రాలైన వాటికన్ సిటి.., మక్కా... వంటి ప్రాంతాలకు కూడా రద్దీ తగ్గింది. 

 

               రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత కష్టంగా ఉండే పరిస్థితులు ఉన్నాయని... ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను సూచనలను ప్రజలు తప్పనిసరగా పాటించాలని కోరుతున్నారు ప్రభుత్వ పెద్దలు.