తెలంగాణ డైయాగ్నోస్టీక్స్ మినీ హబ్స్ ప్రారంభించిన- మంత్రి KTR

   తెలంగాణ డైయాగ్నోస్టీక్స్ మినీ హబ్ ను మంత్రి కేటీర్ రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ లో నేడు ప్రారంభించారు.  ఈ రేడియాలజీ ( X-ray, USG, ECG) ఇలా మొతంగా 57 రకాల  సేవలు ఈ కేంద్రం లో అందుబాటులో ఉండనున్నాయి. మరి కొద్ది రోజుల్లో సీటీ స్కానింగ్ కూడా అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి కేటీఆర్. పేద ప్రజలకు ఈ డైయాగ్నోస్టిక్స్   అందుబాటులో ఉంటుంది. ఇది పూర్తిగా ఉచితంగా ఉపయోగించు కోవచ్చు. ప్రజలందరూ ఈ సెంటర్ల ను ఉపయోగించుకోవాలని కేటీర్ కోరారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్, డిప్యూటీ మేయర్ లు పాల్గొన్నారు.