తెలంగాణ కొత్త CS రేసులో ఇద్దరి పేర్లు .. అరవింద్‌కే నా ఆశీస్సులంటున్నకేటీఆర్..ఎవరీ అరవింద్?

   తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేస్తూ ఏపీకి వెళ్లిపోవాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఇక తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కొత్త సీఎస్ ల లిస్టులో ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు అరవింద్ కుమార్, రెండోది రామకృష్ణారావు. వీరిద్దరిలో ఒకరు సీఎస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ వీరిద్దరిలో అరవింద్ కుమార్ కే ఎక్కువ అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం అర్భన్ డెవలప్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ కు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మంత్రి కేటీఆర్ అరవింద్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. దీంతో కేటీఆర్ మొగ్గు చూపే అరవింద్ సీఎస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.