తెలంగాణలో మళ్లీ కరోనా విజ్రుంభణ......

  తెలంగాణలో రోజురోజుకు క్రమంగా కేసులు పెరుగుతున్నాయి.. వరుసగా మూడో రోజూ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. నిన్న వెయ్యి దాటిన కేసులు ఇవాళ రెండు వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో 54,534 కరోనా టెస్టులు చేయగా.. 1,913 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,87,456కి చేరింది. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 1214 కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 4,036కు చేరింది. కరోనా నుంచి మంగళవారం 232 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,847 ఐసోలేషన్, యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.