ఢిల్లీకి వెళ్లిన బండి సంజయ్..

    బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై బీజేపీ హై కమాండ్ కు నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదికలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరనున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా మరికొందరు బీజేపీలో చేరేవారి లిస్ట్ ను తీసుకెళ్లారు బండి సంజయ్. కాగా జనవరి (2023) 16-17 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులను నియమించనున్నారు. తెలంగాణపై గురి పెట్టిన బీజేపీ ఈ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా నేతలను పార్టీలో చేర్చుకోవటం వంటి అంశాలను ఎజెండాగా పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా కృషి చేస్తోంది.