డబుల్ బెడ్ రూం ఇళ్లు బాగున్నాయి 

 

            తెలంగాణ ప్ర‌భుత్వం పేద‌ల‌కోసం  నిర్మిస్తున్న రెండు ప‌డ‌క గ‌దుల ఇళ్లను పరిశీలించారు  హ‌డ్కో ఛైర్మ‌న్  మరియు మేనేజింగ్ డైరెక్ట‌ర్   మేడితి ర‌వికాంత్. కోల్లూర్ వద్ద 124 ఎక‌రాల విస్తీర్ణంలో 117 బ్లాకుల‌లో 15,660  డబుల్ బెడ్ రూం ఇల్లను  నిర్మిస్తుంది జిహెచ్ఎంసి. దేశంలో ఎక్క‌డాలేనివిధంగా ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా 124 ఎక‌రాల్లో ఒకే చోట అత్యంత నాణ్య‌త‌గా, పూర్తిస్థాయి మౌలిక వస‌తుల‌తో నిర్మిస్తున్న ఇళ్లను చూసిన హడ్కో చైర్మన్  సంతృప్తి వ్య‌క్తం చేశారు. కొల్లూరులో నిర్మిస్తున్న రెండు ప‌డ‌క గ‌దుల ఫ్లాట్లు దేశానికే మోడ‌ల్‌గా నిలుస్తుందన్నారు.  ప్ర‌తి ఫ్లాట్‌కు కేంద్ర ప్ర‌భుత్వం    ల‌క్ష 50వేల‌ను ఆర్థిక స‌హాయంగా అందిస్తుండగా....,  రాష్ట్ర ప్ర‌భుత్వం హ‌డ్కో నుండి రుణం  తీసుకొని ఇళ్ల నిర్మాణం చెపడుతుంది. ప్రతి ఇంటికి 8ల‌క్ష‌ల 65వేల‌ను వెచ్చిస్తుంది ప్రభుత్వం.   2020 మార్చి నెలాఖ‌రుకు 15వేల 660 ప‌నులు  పూర్తిచేసి ల‌బ్దిదారుల‌కు అప్ప‌గించాల‌ని హ‌డ్కో ఛైర్మ‌న్ సూచించారు. బల్దియా కమీషనర్ మరియు హౌజింగ్ అధికారులు ప్రాజెక్టు వివరాలను  హడ్కో చైర్మన్ కు వివరించారు.