ట్రాఫిక్ క‌ష్టం గుండెకు న‌ష్టం

  • ట్రాఫిక్ క‌ష్టం గుండెకు న‌ష్టం

           ట్రాఫిక్ ఇక్క‌ట్ల‌తో వ‌చ్చే ప‌లు రోగాల‌కు తోడు తాజాగా గుండేజ‌బ్బుకూడా ఈ జాబితాలో చేరింది.  ట్రాఫిక్ లో ఉండే ఒత్తిడే ఇందుకు కారణం అని తెల్చారు నిపుణులు. ప్రస్తుత తరుణంలో నగరాల్లోనే కాదు, ఓ మోస్తరు పట్టణాల్లోనూ ట్రాఫిక్ సమస్య రోజు రోజుకీ పెరుగుతున్నది. రోడ్డు పైకి వ‌స్తే చాలు ఎప్పుడు ఎక్క‌డ రోడ్డు జాం అవుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కోంటుంది. అధి ఎప్పుడు క్లియ‌ర్ అవుతుందో అంత‌కంటే తెలియ‌దు.  దీంతో వాహ‌దారులే కాకుండా... ఇత‌ర వాహ‌నాల్లో ప్ర‌యాణించే ప్ర‌యాణికులు నిత్యం రహదారులపై నరక యాతన ప‌డుతుంటారు. గంటల తరబడి ట్రాఫిక్ జాంలలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అయితే ట్రాఫిక్ జాంల మాటేమోగానీ.. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమయ్యే వారికి గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయట. పలువురు సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. నిత్యం ట్రాఫిక్‌లో చిక్కుకుని గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలని ఆందోళన ఉన్నవారికి గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. గమ్యస్థానాలకు వేగంగా చేరుకుంటామా, లేదా అన్న ఆందోళనతోపాటు, ట్రాఫిక్‌లో వాహనాలు చేసే చప్పుళ్లకు తీవ్ర ఒత్తిడికి గురై గుండె సమస్యలు వస్తాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 

          ఇక  రద్దీ లేని సమయాల్లోనే  రహదారులపై వెళితే భాగుంటుంది క‌దూ.  లేదంటే జ‌ర్నీకి కోద్దిగా ఎక్కువ టైం కేటాయించుకోని బ‌య‌లుదేరడం మంచిది.  దాంతో  ఆందోళనను తగ్గించుకోవడంతోపాటు గుండె సమస్యలు రాకుండా చూసుకోవచ్చని సైంటిస్టులు సూచిస్తున్నారు.