ట్రాక్ పై నిలిచిపోతున్న మెట్రో ప్రయాణికుకు కష్టాలు

                       హైద‌రాబాద్ మెట్రో ఎంతో ప్ర‌తిస్టాత్మ‌క ప్రాజెక్టు... అంత‌ర్జాతీయంగా అందుబాటులో ఉన్న హైఎండ్  టెక్నాల‌జీని ఈ  మెట్రోలో యూజ్ చేశారు అధికారులు. ప్ర‌పంచంలోని రెండు వంద‌ల మెట్రోల్లో అత్యాదునిక‌మైన స‌ద‌పాయాలు హైద‌రాబాద్ మెట్రో రైళ్లో అందుబాటులోకి తెచ్చామని అధికారులు ప‌దే ప‌దే చెబుతుంటారు.  అయినా కోన్ని స‌మ‌స్య‌లు మెట్రోను ఇంకా వెంటాడూతూనే ఉన్నాయి. టెక్నికల్ స‌మ‌స్య‌ల‌తో హైద‌రాబాద్ మెట్రో ప్ర‌యాణికుల‌కు జ‌ల‌క్ ఇస్తూనే ఉంది.   సేవలు నిలిచిపోయన సందర్భల్లో సైతం అధికారులు  క్లియర్ గా వివరాలు తెలపడం లేదు.  ఆలస్యానికి చింతిస్తున్నామని చెప్పడం తప్పితే ఎప్పుడు ప్రయాణం ప్రారంభం అవుతుంది..., ఎంత సమయం పడుతుందన్న అంశాలపై  వివరాలు చెప్పడం లేదు మెట్రో స్టేషన్లలో ఉంటున్న సిబ్బంది. చాలా సందర్బాల్లో టికెట్లు కోనుగోలు చేసి స్టేషన్ లోని ట్రాక్ లేవల్ కు వెళ్లిన తరువాత రైళ్లు నిలిచిపోయాయి అని తెలుస్తుంది. దాంతో అప్పటి కప్పుడు వెనక్కి వెళ్లలేక ముందుకు పోలేక ఇబ్బందులు పడుతున్నారు మెట్రో ప్రయాణికులు..                                          

                      హైద‌రాబాద్ మెట్రో రైల్ ను సాంకేతిక క‌ష్టాలు వెంటాడుతున్నాయి. నిత్యం ఎప్పుడో ఒక‌ప్పుడు మెట్రో టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆగిపోతుంది మెట్రో రైల్.   విద్యుత్ స‌ర‌ఫరాలో స‌మ‌స్య  ఓసారి..,    సిగ్నలింగ్ సమస్య మరోసారి..., ప్లెక్సీలు పడటం  ఇంకోసారి   ఇలా  ఎదో ఒక  స‌మ‌స్య తో రైళ్లు ఆగిపోవ‌డం...., స‌మ‌యానికి వెళ్తామ‌నుకున్న  ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డ‌టం ఇప్పుడు మెట్రోలో హాట్ టాఫిక్ అయ్యింది.  ఎన్నో ఉన్న‌త‌మైన ప్ర‌మాణాలు పాటించి నిర్మించిన మెట్రోలో ఎందుకు ఇలా  త‌రుచు స‌మ‌స్య వ‌స్తున్నాయ‌నేది చ‌ర్చ‌నీయ  అంశంగా మారింది.  తాజాగా టెక్నికల్ ప్రాబ్లమ్  కారణంగా అక్టోబర్ లో మియాపూర్ నాగోల్ మార్గంలో మెట్రో సేవలు నిలిచిపోగా ఈ రోజు కూడా మెట్రో 20నిముషాలు నిలిచిపోయింది. వేగంగా త‌మ డెస్టినేషన్ చేరుకోవ‌చ్చ‌నుకున్న ప్ర‌యాణికుల‌కు అప్పుడ‌ప్పుడు మెట్రో రైల్ బ్రెక్ వేస్తుంది.    అయితే ఎప్పుడు బ్రేక్ ప‌డుతుందో ఎప్పుడు ముందుకు క‌దులుతుందో అధికారులే అంచ‌నా వేయ్య‌లేక పోతున్నారు.  నిర్వహణ లోపం తో  ప్యాసెంజర్లకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారన్న  ఆరోపణలున్నాయి. తాజాగా ఈ రోజు ఉదయం కూడా మెట్రో సేవలు నిలిచిపోయాయి. మియాపూర్ నుంచి ఎల్బీనగర్    మార్గంలో రైలు సేవలు నిలిచిపోయాయి.   దాదాపు 15 నుంచి 20 నిమిషాల వరకు రైళ్లు ఆగిపోవడంతో  రైళ్లు ఆలస్యం అయ్యాయి.  దాంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ప్రయాణికులు. ఆఫిసుకు వెళ్లే సమయంలో ఇలా  ఆలస్యం కావడంతో ఒకింత అసహనానికి లోనయ్యారు ప్రయాణికులు.

                              ప్రారంభం నుండి కూడా హైదురాబాద్ మెట్రో రైల్ ను వ‌రుస‌ సాంకేతిక స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. ట్రైన్లు  ఎప్పుడు  ఎక్క‌డ  నిలిచిపోతుయో తెలియ‌డం లేదు.   ట్రాక్ లపై ట్రైన్లు  నిలిచిపోవడంతో  రైలు ముందుకు కదలక పోవడంతో ఎమర్జేన్సీ డోర్ నుండి ప్రయణికులను క్రిందికి దించి స్టేషన్లకు పంపించిన సందర్బాలు ఉన్నాయి.   సమస్యను క్లీయర్ చేసి మెట్రో  సేవలు రిస్టోర్  చేయ్యడానికి 30 నిముషాల నుండి రెండు  రెండున్నర గంటలకు పైగా  టైం పట్టిన సందర్బాలున్నాయి. కోన్ని సార్లు ఎకంగా టికెట్ కౌంటర్లు మూసివేయ్యడంతోపాటు రైళ్లు రద్దు చేశారు. ఒకసారి కమ్యూనికేషన్  బెస్డ్ ట్రైన్ కంట్రోల్ విధానంలో వచ్చిన లోపంతో పలు ప్రాంతాల్లో ట్రైన్లు నిలిచిపోయాయి. తరుచుగా నాగోల్ - రాయదుర్గం మార్గం మరియు ఎల్బీనగర్ - మియాపూర్ మార్గంలో సాంకేతిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ రోజు ఎల్బీనగర్ - మియాపూర్ మార్గంలో సాంకేతిక సమస్యల కారణంగా మెట్రో సేవలు నిలిచిపోయాయి.    సెప్టంబర్ నెలలో నాగోల్ - హైటెక్ మార్గంలో మెట్రో సేవలు నిలిచిపోగా.. అక్టబర్ నెలలో ఎల్బీనగర్ - మియాపూర్ మార్గంలో సేవలకు అంతరాయం కల్గింది. మళ్లి ఈ రోజు ఇదే మార్గంలో మెట్రో సేవలు నిలిచిపోయాయి.  ఇలా  చాలా సందర్భాల్లో మెట్రో సేవలకు సాంకేతిక సమస్యల కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి.  ఇక స్మార్ట్  కార్డులు..., లిఫ్ట్ లు..., ఎక్సావేటర్లలో వచ్చే ఇబ్బందులు అధికం. వేగంగా ప్రయాణం చేయడానికి మెట్రోను ఆశ్రయిస్తున్నా ప్రయాణికులను సాంకేతిక కష్టాలు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.