టీఆర్ఎస్ కు ఉద్యోగులు దూరం..

టీఆర్ఎస్ కు ఉద్యోగులు దూరం..
పోస్ట‌ల్ బ్యాలెట్ లో అధికార పార్టీ వెనుకంజ.
రేవంత్‌ రెడ్డికి అత్యధికంగా 841 పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు. 
ఉద్యోగుల‌పై కేసిఆర్ వ్యాక్య‌లే కార‌ణ‌మా..?

                  పోస్టల్‌ బ్యాలెట్‌లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు చుక్కెదురైంది. పోస్ట‌ల్ బ్యాలేట్ లో టిఆర్ఎస్ మూడ‌వ‌స్థానానికి ప‌డిపోయింది. అయితే పోస్టల్‌ బ్యాలెట్‌లో బీజేపీ సత్తా చాటింది.   లోక్‌సభ ఎన్నిక‌ల్లో  17,022 పోస్టల్ బ్యా ఓట్లు పోలవ్వగా టీఆర్‌ఎస్‌కు కేవలం 4,178 పోస్టల్‌ ఓట్లు మాత్రమే పడ్డాయి.  అత్యధిక స్థానాల్లో బీజేపీకి మిగతా పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.  బీజేపీకి 6,196 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 5,162 ఓట్లు వ‌చ్చాయి.  మెజారిటీ స్థానాల్లో గెలిచే అభ్యర్థులకే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పడ్డాయి. అయితే మహబూబ్‌నగర్‌, జహీరాబాద్‌లో బీజేపీకి పోస్టల్‌ ఓట్లు ఎక్కువగా వచ్చినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి డీకే అరుణ ఓటమి పాలయ్యారు. పోస్టల్‌ ఓట్లలో రేవంత్‌ రెడ్డికి అత్యధికంగా 841 ఓట్లు రాగా, ఖమ్మం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 838, నిజామాబాద్‌ బీజేపీ అభ్యర్థి అర్వింద్‌కు 836, కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు 814 ఓట్లు వచ్చాయి.