జ్ఞాపక శక్తి తగ్గిందా ? ప‌ంచుకోండిలా...

 

  •  జ్ఞాపక శక్తి తగ్గిందా ? ప‌ంచుకోండిలా...  

   ప్రస్తుతం పిల్లలలో , యువతి యువకులలో , వృద్ధులలో జ్ఞాపక శక్తి తక్కువగా వుంటుంది . క్రోధం , అత్యధికంగా చింతించిడం , భయం , ఎక్కువగా భావా వేశం కలిగి వుండడం , శోకం , ఎల్లప్పుడూ చదవడం మొదలగు కారణాల వలన జ్ఞాపక శక్తి తగ్గి పోతుందుకు కార‌ణాలు. 
 
                      మ‌న ఇంట్లో ల‌భించే ప‌దార్థ‌ల‌తోనే చికిత్స‌. 

1. 1/2 Spoon  శంఖ పుష్పం పొడి  + 1 Spoon  తేనె  + 250 గ్రాముల  ఆవు పాలలో కలిపి ప్రతి రోజు  ఉద‌యం త్రాగండి . 

2 .  శంఖ పుష్పం పొడి   +  బ్రాహ్మి పొడి   +  ఉసరి పొడి  +  తిప్ప తీగ పొడి  +  జఠామాంసి పొడి..  వీటిని సమ పాళ్ళలో కలిపి చూర్ణంగా తయారు చెయ్యండి .. ఆ చూర్ణం ని 1/2 spoon చూర్ణం  + 1 గ్లాసు నీళ్ళలో కలిపి , ప్రతి రోజు ఉదయం , సాయంత్రం త్రాగండి . 

3. 8 నుండి 10  బాదం పప్పులని రాత్రి ఒక గ్లాసు నీళ్ళలో నాన బెట్టండి . ఉదయం తొక్కలు తీసి పేస్ట్ లాగా చెయ్యండి . 
బాదం పేష్ట్   + కొద్దిగ నల్ల మిరియాల పొడి + 250 గ్రాముల వేడి ఆవు పాలలో కలపండి . 
ఈ ఆవు పాలు చల్లారిన తర్వాత , 2 spoon ల తేనె + 1 spoon దేశీయ ఆవు నెయ్యిని కలిపి త్రాగండి . 

4. 8 --10 గోడంబి ముక్కలు + 1 గ్లాసు ఆవు పాలలో మరిగించి త్రాగండి . స్మరణ శక్తి పెరుగుతుంది . 

5  1 Spoon అతి మధురం పొడి + 1 గ్లాసు ఆవు పాలలో కలిపి త్రాగండి . 

6 . కర్బూజా పండు ముక్కలు +  ఆవు నెయ్యిని కలిపి , నమిలి నమిలి తినండి . జ్ఞాపక శక్తి పెరుగుతుంది . 

7 .  మామిడి పండ్ల రసం  +  అల్లం రసం  +  తులసి ఆకుల రసం లను సమ పాళ్ళలో కలిపి 1 Spoon తేనె ను కలిపి త్రాగండి . 

8 . సోంపు గింజల పొడి + తేనె ను కలిపి తీసుకొండి. 

9 . 1 Spoon పిపిళ్ళ చూర్ణం +  1 గ్లాసు వేడి నీళ్ళలో కలిపి , ప్రతి రోజు ఉదయం , సాయంత్రం త్రాగండి . 

      పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి , జ్ఞాపక శక్తిని పెంచు కొండి .