జిహెచ్ఎంసి 2021-22  బడ్జెట్  5600కోట్లు..

జిహెచ్ఎంసి 2021-22  బడ్జెట్  5600కోట్లు..
 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2021-22 వార్షిక బడ్జెట్ రూ. 6,841.87 కోట్లుగా నిర్థారించిన బడ్జెట్ ను   వర్చువల్ గా జరిగిన జిహెచ్ఎంసి సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బడ్జెట్ ను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రవేశపెట్టగా, బడ్జెట్ లోని వివరాలను జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ సమావేశంలో వివరించారు. ఈ బడ్జెట్ పై విస్తృతంగా  జరిగిన చర్చలో సభ్యులు పలు సూచనలు చేశారు. అనంతరం ఈ బడ్జెట్ ను ఆమోదిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.

బడ్జెట్ వివరాలు....

*  జిహెచ్ఎంసి బడ్జెట్ రూ. 5600 కోట్లు
* డబుదల్ బెడ్ రూం ఇళ్ల బడ్జెట్ రూ. 1241.87 కోట్లు

* రెవెన్యూ ఆదాయం రూ. 3571 కోట్లు కాగా రూ. 983.04 కోట్లు మూలధన ఆదాయం (Capital Reciepts)

* ఇక రెవెన్యూ ఆదాయాన్ని గనక పరిశీలిస్తే అధిక శాతం రూ. 1850 కోట్లు ఆస్తిపన్ను రూపంలో లభిస్తోంది.

* మొత్తం GHMC వార్షిక బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం రూ. 2,414 కోట్లు కాగా క్యాపిటల్ వ్యయం రూ. 3,186 కోట్లు

* Housing Corporation నుండి వచ్చే బడ్జెట్ రూ. 1241.87 కోట్లు.

* 15వ ఫైనాన్స్ కమీషన్ క్రింద రూ. 355 కోట్లు.


       2021-22 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం/ తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించిన నిధుల ద్వారా వస్తాయని అంచనా వేయడం జరిగింది.

* 2019-20 ఆర్థిక సంవత్సరంలో 3వ విడత మున్సిపల్ బాండ్ ద్వారా రూ. 100 కోట్లు
                                           రూపి టర్మ్ లోన్ మొదటి దశ ద్వారా రూ. 622.60 కోట్లు

* 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూపి టర్మ్ లోన్ 1 ద్వారా SRDP కి రూ. 654.07 కోట్లు
                                            రూపిటర్మ్ లోన్   2 ద్వారా CRMP కి రూ. 621.18 కోట్లు