జిహెచ్ఎంసిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి

జిహెచ్ఎంసి సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్దిపై దృష్టి పెట్టింది. బల్దియా  పరిధిలో క్షేత్ర స్థాయిలో ఉన్న ఆయా కార్యాలయాల్లో  సంప్రదాయేతర ఇంధన వనరులను  ప్రోత్సహించడం చేస్తుంది. దాంతో ఉత్పత్తి చేసిన  విద్యతో వాడకం ద్వారా  విద్యుత్ బిల్లుల భారం కాకుండా చూస్తున్నారు అదికారులు. ఇప్పటికే   పలు కార్యాలయ భవనాలకు సోలార్  విద్యుత్ ప్లాంట్లను అమర్చడం జరిగింది. పలు కార్యాలయ భవనలకు  సోలార్ ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు 941 kwp సోలార్ పి.వి గ్రిడ్ రూఫ్ టాప్ సిస్టమ్.., నెట్ మీటరింగ్   పద్ధతిలో సప్లై చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణ ఇందన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (TSREDCO)  3.50 కోట్ల రూపాయలతో   కాంట్రాక్టు ఒప్పందం చేసుకుంది జిహెచ్ఎంసి.  సోలార్ సిస్టం ఏర్పాటుకు డిజైన్, సప్లై, ఇన్స్టలేషన్ తో పాటుగా ఐదేళ్ల వరకు  పూర్తి నిర్వహణ భాద్యత వారిదే ఉంటుంది. ప్రతి సంవత్సరం 1500 కిలో వాట్స్   మినిమం జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి  చేయాలి  నిర్వహణ సంస్థ.  అంటే 14,11,500 యూనిట్స్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కున మొత్తంలో జనరేట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ  జనరేట్ అయిన  విద్యుత్ ఆదా చేస్తే జిహెచ్ఎంసికి మినిమం రెండున్నర ఏళ్లలోపు గాని.., అంతకంటే ముందు గాని 1.27 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు అధికారులు. ఇప్పటి వరకు 34 కార్యాలయ భవనాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడం జరిగింది.