గుండే జబ్బులకు దూరంగా ఉండండి

గుండే జబ్బులకు దూరంగా ఉండండి

 

                      ఆపిల్ పండ్లను తినేవారికి, గ్రీన్ టీని నిత్యం సేవించే వారికి గుండె జబ్బులు, క్యాన్సర్ రావని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఆపిల్ పండ్లు, గ్రీన్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఆయా జబ్బులు రాకుండా చూస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఎడిత్ కొవాన్ యూనివర్సిటీ పరిశోధకులు నిత్యం ఆపిల్ పండ్లను తింటూ, గ్రీన్ టీ తాగే 53వేల మందిపై పరిశోధనలు చేశారు. దీంతో తెలిసిందేమిటంటే.. ఆపిల్ పండ్లు, గ్రీన్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్ గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చూస్తాయని నిర్దారించారు. ఈ మేరకు సైంటిస్టులు చేపట్టిన సదరు పరిశోధన తాలూకు వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ అనే ఓ జర్నల్‌లోనూ ప్రచురించారు. నిత్యం 500 మిల్లీగ్రాముల మోతాదులో ఫ్లేవనాయిడ్స్ అందేలా చూసుకుంటే పైన చెప్పిన విధంగా ఆయా జబ్బులు రాకుండా ఉంటాయని ఈ సందర్భంగా సైంటిస్టులు తెలిపారు.