కౌంటింగ్ కు అంతా సిద్దం..

కౌంటింగ్ కు అంతా సిద్దం..

తెలనున్న అభ్యర్థుల భవితవ్యం..

 

                  బల్దియా యుద్దం చివరి అంకాని చేరింది. రేపు ఉదయం 8గంటలకు కౌంటిక్ కు అన్ని ఎర్పాట్లు కంప్లీట్ చేసింది జిహెచ్ఎంసి. 150సెంటర్లు..., 420టెబుళ్లు..., 8152మంది సిబ్బంది..., 1120మంది అభ్యర్థుల భవితవ్యం తెల్చనున్నారు.  గ్రేటర్ పోలిటికల్ పోరు చివరి ధశకు చేరింది. ఎన్నికల్లో ఫైనల్ సీన్ 4వ ఉదయం ప్రారంభం కానుంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం తెలిపోనుంది. ఎవ్వరూ విజేతలు... ఎవ్వరూ పరాజితులు అనేది రేపు మద్యహ్నం 2గంటల వరకు ఒక లెక్కతెలనుంది. 74లక్షల 67వేల 256ఒటర్లకు గాను 34లక్షల 50వేల 331మంది తమ ఒటు హాక్కును వినియోగించుకున్నారు.   మొత్తం 1120మంది పోటిపడుతుండగా ప్రదాన పార్టీల అభ్యర్థుల మద్య పోటి ఉండనుంది. 

 

                      సిటిలో 30ప్రాంతాల్లోని 150స్ట్రాంగ్ రూంల వద్ద 150ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను ఎర్పాటు చేశారు.  ప్రతి కౌంటింగ్ సెంటర్ లో 14టెబుల్స్ ఎర్పాటు చేసి  కౌంటింగ్ ప్రక్రియను  చెపడుతున్నారు.  అందుకోసం కౌంటింగ్ సెంటర్లును పూర్తి స్థాయిలో ఎర్పాట్లు కంప్లీట్ చేశారు.  ప్రతి టెబుల్ కు ముగ్గురు చోప్పున కౌంటింగ్ సిబ్బంది ఉంటారు  మొత్తం అన్నిరకాల సిబ్బంది.., అధికారులు కలిపి 8,152 మంది కౌంటింగ్ లో పాల్గోనున్నారు. 

                 

                   కౌంటింగ్ ప్రక్రియలో మొదట పోస్టల్  బ్యాలెట్ పత్రాలను లెక్కవేస్తారు అది పూర్తి అయిన తరువాత బ్యాలెట్ బాక్స్ లను ఒపెన్ చేసి బ్యాలెట్ పేపర్లను 25చోప్పున బెండల్స్  తయారు చేస్తారు. అన్ని బ్యాలెట్ల బెండల్స్ ను డ్రమ్ములో వేసి కలిపి ప్రతి టెబుల్ కు వెయ్యిచోప్పున పంపిణి చేస్తారు. అప్పుడు పార్టీల వారిగా టెబుల్ పై ఎర్పాటు చేసిన బాక్సుల్లో కౌంటింగ్ సిబ్బంది బ్యాలెట్ పేపర్లు వేస్తారు. అలా మొత్తం 1000 బ్యాలెట్ పేపర్లు కంప్లీట్ అయ్యాక పార్టీల వారిగా లెక్కలు తీస్తారు. ప్రతి టెబుల్ వద్ద ఉన్న ఎజెంట్లతో సంతకం తీసుకోని... దానిని ప్రిసైండింగ్ అధికారికి తెలియజేస్తారు. అప్పుడు పూర్తి వివరాలతో రౌండ్ ఫలితాలు ప్రటిస్తారు  ప్రిసైండింగ్ అధికారి.  మొదటి రౌండ్ పూర్తి అయి ఫలితం ప్రకటించిన  తరువాతే  రెండవ రౌండ్ ప్రారంభం అవుతుంది. ఇక సిటిలో తక్కువ ఒట్లు పోలైన  మోహది పట్నం డివిజన్ లో ఫస్ట్ ఫలితం వెలువడనుంది. ఇక అత్యదికంగా ఒట్లు పోలిన మైలార్ దేవులపల్లి లో మూడవ రౌండ్ లో పలితం రానుంది. అయితే కౌంటింగ్ లో అన్ని సక్రమంగా జరిగకుంటే ఆయా ప్రాంతాల్లో ఫలితాలు వచ్చే సమయంలో మార్పు ఉండవచ్చేఅవకాశం ఉంది.