కోత్త పాలకమండలి ఎప్పుడు...?

 

             హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్ల భవితవ్యం తెలిపోయింది. హోరా హోరిగా జరిగిన పోరులో హైదరాబాద్ ఒటర్ ఎ ఒక్క పార్టీ వైపు మొగ్గుచూపలేదు. కార్పోరేషన్లో ఎపార్టీకి క్లీయర్ మేజారీటి రాలేదు. దాంతో  కోత్త పాలక మండలి ఎప్పుడు అన్నది ఇప్పుడు చర్చనీయ అంశం అయ్యింది.  కోద్ది రోజుల క్రితం వరకు బల్దియాలో ఎ పార్టీ గెలుస్తుంది..., ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి..., మేయర్ ఎవరౌతారు..,  ఇది ప్రదానంగా ఉన్న టాపిక్. ఇప్పుడు పార్టీల బలాబలాలు ఫైనల్ కావడంతో పాలకమండలి ఎప్పుడు ఎర్పాటు అవుతుందన్న అంశంపై చర్చసాగుతుంది. జిహెచ్ఎంసి ఎర్పాటు అయిన తరువాత ఎర్పాటౌతున్న ముడవ పాలకమండలి   ఎప్పుడు  కోలువుతీరుతుందన్న  చర్చప్రారంభం అయ్యింది.

 

                ప్రస్తుతం ఉన్న పాలకమండలి..., మేయర్ బోంతు రామ్మోహన్..., డిప్యూటి మేయర్ బాబాఫసియుద్దీల పదవీకాలం ఫిబ్రవరి 10వ తేది వరకు ఉంది. చట్టం ప్రకారం ప్రభుత్వం  ఆర్డినెన్స్ ద్వారా మండలి రద్దచేయవచ్చు. లేదంటే చట్టాన్ని పూర్తిగా మార్చాల్సి ఉంటుంది.  అప్పుడు  కోత్త పాలకమండలి ఎర్పాటు చేయ్యవచ్చు.  అంతవరకు ప్రస్తుతం ఉన్న పాలక మండలినే కోనసాగే అవకాశంది. ఇప్పటికే 2021-2022 ఆర్తిక సంవత్సరానికి స్టాండింగ్ కమీటి ముందు బడ్జెట్ పెట్టారు అధికారులు. దానిిని అమోదించి డిసెంబర్ 10నాటికి స్టాండింగ్ కమీటి ఆమోదించాల్సి ఉంటుంది. దానిని డిసెంబర్ 15నాటికి బల్దియా పాలకమండలి ముందుకు పెట్టాలి. లేదంటే వచ్చే ఏడాది బడ్జెట్ అలస్యం అయ్యే అవకాశం ఉంది.  దాంతో ప్రస్తుతం ఉన్న పాలక మండలి తన పనులు పూర్తి చేసే అవకాశం ఉందంటున్నాయి అధికార వర్గాలు. అయితే కోత్తగా గెలిచిన పాలక మండలిలో ఎపార్టీటికి క్లీయర్ మేజారీటి రాలేదు. 56స్థానాలు టిఆర్ఎస్..., బిజేపి 48..., 44ఎంఐఎం..., కాంగ్రేస్ 2 స్థానాల్లో విజయం సాదించింది. ఎక్స్ అఫిషియో సభ్యులతో ఎక్కువ స్థానాలు కలిగిన టిఆర్ఎస్ మేయర్ డిప్యూటి మేయర్ పిఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. లేదా... బిజేపి.., ఎంఐఎం.., టిఆర్ఎస్ ఎవ్వరికి వారు పోటిలో ఉంటే కూడా టిఆర్ఎస్ కే ఎక్కువ స్థానాలు ఉండటంతో మేయర్ సిటిపై కూర్చోవచ్చు.  సగానికిపైగా  కార్పోరేటర్లను టిఆర్ఎస్ గెలుచుకోకపోవడంతో మరికోన్ని రోజులపాటు మేయర్ ఎన్నిక ఉండకపోవచ్చన్న వాదనలున్నాయి. కౌంటింగ్ అనంతరం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ మాట్లాడుతూ  మేయర్ ఎన్నికకు ఇంకా సమయం ఉంది కదా అని చెప్పడం చూస్తూంంటే కోత్త పాలక మండలి ఎర్పాటుకు మరింత సమయం పట్టి అవకాశాలు  కనిపిస్తున్నాయి.