కేసీర్ కు మోడీ తో నేరుగా సంబంధాలు ఉన్నాయి.. రాహుల్

    భరత్ జోడో యాత్రను హింస, విద్వేషానికి వ్యతిరేకంగానే  చేపట్టినట్లు కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ హింస, విద్వేష రాజకీయాలు చేస్తున్నాయన్నారు. భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదని, ఇది యాత్ర మాత్రమే కాదని భారత ప్రజల గొంతుకని రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక హైదరాబాదులో రోడ్లు తక్కువ, గుంతలు ఎక్కువని చురకలు రాష్ట్ర ప్రభూత్వానికి చురకలు అంటించారు. తెరాస, బీజేపీ ఒక్కటేనాని.. పార్లమెంతులో బీజేపీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు ఆమోదం తెలుపుతుందని దుయ్యాబేట్టారు. ప్రధాని మోడితో కేసీర్ కు డైరెక్ట్ కనెక్షన్ ఉందని తీవ్రంగా విమర్శించారు..