ఒత్తిడి డిప్రెష‌న్ త‌గ్గాలా..? నో డాక్ట‌ర్

గ‌జిబిజి ప‌రుగుల జీవితంతో ప‌ట్ట‌ణాలు న‌గ‌రాల్లో ప్ర‌జ‌లు నిత్యం   ఒత్తిడికి గుర‌వుతుంటారు. దాంతో మానసిక స‌మ‌స్య‌లు, డిప్రెష‌న్‌, ఆందోళ‌న‌ల‌కు గురై స‌త‌మ‌తం అవుతుంటారు.  అయితే అలాంటి స‌మ‌స్య‌కు చెక్ పెట్టాలంటే పార్కుల‌కు వెళ్లాలంటున్నారు నిపుణులు.  ప్ర‌తి రోజు  20 నిమిషాల పాటు ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో అలా అలా తిరిగితే    మీ ఒత్తిడి మ‌టుమాయం అవుతుందట‌. అవును, ఇది నిజ‌మే.  చెప్పింది జోతిష్యులు కాదు . సైంటిస్టులు.  వారు చెప‌ట్టిన  ప‌రిశోధ‌న‌ల్లో  ఈ విష‌యం   వెల్ల‌డైంద‌ట‌.  నిత్యం 20 నిమిషాల పాటు ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో గ‌డిపితే ఒత్తిడి అంతా పోతుందట‌.  యూనివ‌ర్సిటీ ఆఫ్ అల‌బామాకు చెందిన సైంటిస్టులు నిత్యం పార్కుల‌కు వెళ్లే 100 మందిపై అధ్య‌య‌నం చేశారు. వారికి ఉన్న మాన‌సిక స‌మ‌స్య‌లు, సంతృప్తిక‌ర‌మైన జీవితం వంటి అంశాల‌పై వారికి సైంటిస్టులు ప్ర‌శ్న‌లు వేసి రాబ‌ట్టారు. దీంతో తెలిసిందేమిటంటే.. నిత్యం 20 నిమిషాల పాటు ప‌చ్చ‌ని ఆహ్లాద‌క‌ర‌మైన ప్ర‌కృతి వాతావ‌ర‌ణంలో గ‌డిపే వారికి ఒత్తిడి అస‌లు ఉండ‌ద‌ట‌. దీనికి తోడు డిప్రెష‌న్‌, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా పోతాయ‌ని వారు అద్య‌యనంలో గుర్తించారు.    మీరు కూడా ఒత్తిడి బారిన ప‌డితే అలా ఓ 20 నిమిషాలు ఏదైనా పార్కులో తిరిగి రండి. ఒత్తిడి మ‌టుమాయం అవుతుంది.