ఒకే చోట తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

            ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసారు. తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మనువరాలి పెళ్లికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్.., ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకరినోకరు పలుకరించుకున్నారు. ఈ సందర్బంగా పక్కపక్కనే కూర్చోని ముచ్చటించుకున్నారు నేతలు. అయితే ఇటివల ప్రాజెక్టుల విషయంలో జరగిన పరిణామాల నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవడం చర్చనీయ అంశం అయ్యింది. అయితే ఇద్దరి ముఖ్యమంత్రుల మద్య ఇంత సఖ్యత ఉంటే ఏందుకు సమస్యలు పరిష్కారం కావడం లేదనే వాదనలు వినిపిస్తున్నారు. రెండు రాష్ట్రాల మద్య నలుగుతున్న జలవివాదంపై రెండు రాష్ట్రా ప్రజా ప్రతినిధులు తీవ్రమైన ఆరోపనలు చేసుకున్నారు. ఒక రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై మరో రాష్ట్రం అభ్యంతర చెబుతున్నాయి కేంద్రానికి పిర్యాదులు చేసుకున్నాయి.