ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోడీ.....

భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి నేటికి 75 సంవత్సరాలు అవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మొదటగా ఆయన రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకుని త్రివిధ దళాల గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తొలుత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, ఈ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ ఎర్రకోటకు చేరుకుని ప్రధానిని ఆహ్వానించారు. జెండా ఆవిష్కరణ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన రెడు ఎంఐ-17 1వి హెలికాప్టర్లు తొలిసారిగా వేదికపై పూల వర్షం కురిపించాయి. ఈ రెండు హెలికాప్టర్లకు వింగ్ కమాండర్ బల్‌దేవ్ సింగ్ బిష్ట్, వింగ్ కమాండర్ నిఖిల్ మెహ్రోత్రా సారథ్యం వహించారు.