ఎడాపెడా అబార్షన్ పిల్స్‌ వాడకంతో ప్రపంచవ్యాప్తంగా రోజూ 10 మంది మహిళల మృతి

అవాంఛిత గర్భం నుంచి విముక్తి పొందడం కోసం, మీరు ఏదైనా మెడికల్ షాపు నుంచి అబార్షన్ పిల్ తెచ్చుకుని వేసుకుంటున్నారా, అలా చేస్తే అది మీ ఆరోగ్యానికే ప్రమాదకరం కావచ్చు.

ఒక సర్వే ప్రకారం భారత్‌లో 50 శాతానికి పైగా మహిళలు అబార్షన్ కోసం అసురక్షిత పద్ధతుల్లో మందులు వాడుతున్నారు. అలా చేయడం వల్ల 30 నుంచి 50 శాతం మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. అసురక్షిత అబార్షన్ పద్ధతులతో ప్రతి రోజూ పది మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై ఎస్‌బీఐఎస్‌ఆర్‌లో గైనకాలజిస్ట్ డాక్టర్ పాయల్ చౌధరి బీబీసీతో మాట్లాడారు. "అబార్షన్ పిల్స్ మనకు మెడికల్ షాపుల్లో దొరుకుతున్నాయి. అంటే, ఈ అబార్షన్ పిల్స్ ఎఫెక్టివ్ కాదని కాదు. జనం కొనుగోలు చేస్తున్నారు కాబట్టే, వాటిని ఆ షాపుల్లో అమ్ముతున్నారు. కానీ అంత మాత్రాన వాటిని ఉపయోగించడం సబబే అనుకోకూడదు. మెడికల్ అబార్షన్ పిల్ తీసుకోడానికి ఒక ప్రాపర్ పద్ధతి ఉంటుంది. విషాదవశాత్తూ ఇప్పటివరకూ అలా జరగడం లేదు. ఎందుకంటే కెమిస్ట్ నుంచి సులభంగా దొరుకుతుండడం వల్ల కూడా మహిళలకు ప్రైవసీలో తీసుకోవడం, సమస్య నుంచి బయటపడడం అంతా సులభంగా అనిపిస్తుండవచ్చు. కానీ ఈ మందులు తీసుకోడానికి స్ట్రిక్ట్ క్రైటీరియా ఉంటుంది" అన్నారు.
 

  • అర్జెంటీనా: అబార్షన్ హక్కు కోసం పోరాడుతున్న మహిళలు
  • అబార్షన్‌కు చట్టబద్ధత బిల్లును వ్యతిరేకించిన అర్జెంటీనా పార్లమెంట్

డాక్టర్ పాయల్ చౌధరి, గైనకాలజిస్ట్, ఎస్‌బిఐఎస్ఆర్
ఒక వేళ మీరు అబార్షన్ చేసుకోవాలని అనుకుంటుంటే, ఏదైనా ఆస్పత్రికి వెళ్లండి. అక్కడ మెడికల్ ప్రక్రియ ప్రకారం అబార్షన్ చేస్తారు. మొట్టమొదట అల్ట్రాసౌండ్ ద్వారా బిడ్డ గర్భాశయంలో ఉందా, లేదా అనేది తెలుసుకుంటారు. దాని ప్రకారం డాక్టర్ మందులు రాస్తారు. ఈ మందులు తీసుకోడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది.

"ప్రెగ్నెంట్ అయితే, పిరియడ్ మిస్ అయితే, యూరిన్ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వస్తే మీరు దగ్గరిలోని ఏదైనా మెడికల్ ఫెసిలిటీకి వెళ్లచ్చు. మీకు సరైన సమయంలో అల్ట్రా సౌండ్ చేయించుకోమని చెబుతారు. ఒక్కసారి అల్ట్రా సౌండ్ చేయించుకుంటే, బిడ్డ గర్భాశయంలోనే ఉన్నదని, నాళాల్లో లేదని కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు మీకు డాక్టర్ మెడిసిన్ ప్రిస్క్రయిబ్ చేస్తారు. వాటిని తీసుకోడానికి ఒక పద్ధతి ఉంటుంది. కొన్నిసార్లు ఇన్సర్ట్ చేయడానికి మళ్లీ కూడా పిలవచ్చు. రెండు రకాల పిల్స్ ఇస్తారు. వాటిని తీసుకోడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక్కసారి మీరు ఇది చేయించుకుంటే, లోపల ఏదైనా మిగిలిపోయిందేమో చూడ్డానికి రెండు వారాల తర్వాత ఒక రిపీట్ అల్ట్రా సౌండ్ కోసం మళ్లీ పిలిపిస్తారు" అని పాయల్ తెలిపారు.

  • ఏటా 5.6 కోట్ల అబార్షన్లు... ప్రమాదంలో మహిళలు
  • ఐర్లాండ్: ‘అబార్షన్లపై ఉద్యమానికి భారతీయ మహిళ మరణమే కారణం’

గర్భవతి అయిన 7 వారాల నుంచి 9 వారాల తర్వాత అబార్షన్ చేసుకోవడం సురక్షితం అని డాక్టర్లు చెబుతున్నారు.

‘‘ప్రెగ్నెన్సీ లాస్ట్ పిరియడ్ డేట్ నెలసరి ముందు రోజు నుంచి కౌంట్ చేస్తే.. మా ఎంపీటీ గైడ్ లైన్స్ ప్రకారం.. ఏడు వారాల నుంచి, మాగ్జిమం 9 వారాల వరకూ ఈ పిల్ తీసుకోవచ్చు. కానీ అల్ట్రా సౌండ్ చేయించకుండా, డాక్టర్ పర్యవేక్షణ లేకుండా వీటిని కచ్చితంగా తీసుకోకూడదు. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ మాటిమాటికీ తీసుకోవడం కూడా చాలా ప్రమాదం. వాటివల్ల బ్లీడింగ్, ఇన్‌ఫెర్టిలిటీ లాంటి సమస్యలు ఏర్పడవచ్చు.’’

  • గర్భాశయ మార్పిడి ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన మహిళ: దేశంలో ఇదే తొలిసారి
  • ప్రసవంలో బిడ్డ చనిపోతే మళ్లీ గర్భధారణకు ఎన్నాళ్ళు ఆగాలి?

మాటిమాటికీ అబార్షన్ చేసుకోవడం వల్ల కూడా చాలా రకాల నష్టం జరగవచ్చు. మాటిమాటికీ అబార్షన్ చేయించుకుంటే, లోపల ఏవైనా ముక్కలు ఉండిపోతే, మీరు చెకప్ కూడా చేయించుకోకపోతే బ్లీడింగ్ ప్రాబ్లం రావచ్చు. తర్వాత ముందు ముందు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ కోరుకున్నా, కొన్నిసార్లు ఇది ఇన్‌ఫెర్టిలిటీకి కూడా కారణం కావచ్చు.

  • మహిళలు మద్యం తాగితే సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బ తింటుందా...
  • భారత్‌లోని అసమానతలను అంతరిక్షంలోంచి చూడొచ్చ

అబార్షన్ మాత్రలు
దీనిపై మాట్లాడిన పాయల్ "72 గంటల పిల్ అనేది ఐపిల్. అంటే మీరు ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ఇంటర్ కోర్స్ చేసినప్పుడు, ప్రెగ్నెంట్ అవుతామేమో అని మీకు కంగారుగా ఉన్నప్పుడు ఈ పిల్ తీసుకుంటారు. దీనిని 72 గంటల లోపు తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కూడా అందరూ తీసుకోకూడదు. ఎవరైతే రెగ్యులర్ రిలేషన్‌షిప్‌లో ఉంటారో, అంటే పెళ్లైనవారు, ఒకే భాగస్వామితో సుదీర్ఘ బంధం ఉన్నవారు, రెగ్యులర్ కాంట్రాసెప్టివ్స్ పద్ధతులు ఉపయోగించాల్సి ఉంటుంది. వారు ఇలాంటి పిల్ తీసుకోకూడదు. వారు అబార్షన్ పిల్ మాటిమాటికీ తీసుకోవడం వల్ల వేరే సమస్యలు రావచ్చు. ఈ అబార్షన్ పిల్స్ వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వీటికి సరిగ్గా 72 గంటల సమయం అనేం ఉండదు. వీటిని ఎప్పటివరకు మీకు ఇవ్వవచ్చు, అది ఎప్పటివరకూ మీకు సేఫ్ అనేది డాక్టర్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది" అని తెలిపారు.
‘‘అవాంఛిత గర్భం నుంచి బయటపడాలని అనుకుంటున్నప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి భయపడకండి. వారు మీ గుర్తింపును రహస్యంగా ఉంచుతారు’’ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.