ఉప ఎన్నికకు భారీ బందోబస్తు-సీపీ

     మునుగోడు ఉప ఎన్నికల్లో రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు కల్పించినట్లు
రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మునుగోడులో 35 సున్నిత
ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. హింసాత్మక ఘటనలకు అవకాశం ఉన్న కేంద్రాలను గుర్తించామని, రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 
సుమారు 2వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కనీసం తొమ్మిది మంది సిబ్బంది ఉంటారన్నారు.