ఉప్పల్ భగాయత్ భారీ ఆదాయం..

 

ఉప్పల్ భగాయత్ లో చదరపుగజం  55,859 రూపాయలు

 

       తెలంగాణ ప్రభుత్వం   భూముల వేలం ముగిసింది. రెండువ రోజు 21 ప్లాట్లకు వేలం వేస్తే 16ప్లాట్లు అమ్ముడుపోయాయి.  ఉప్పల్ భగాయత్ భూముల వేలానికి మంచి స్పందన వచ్చిందంటున్నాయి హెచ్ఎండిఏ వర్గాలు.   గతంలో ఇక్కడ ఉన్న రికార్డును బ్రేక్ చేస్తూ ఒక గజం ధర ఒక లక్షా  ఒక వెయ్యి రూపాయలు పలికింది. ఈ రోజు మాత్రం అధి 72వేలు మాత్రమే ఉంది.  ఈ సారి నిర్వహించిన వేలంలో సరాసరిగా 55,859 రూపాయలుగా ఉప్పల్ భగాయత్ లే అవుట్ ధర నిర్ణయం అయ్యింది. 

              రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకం ద్వారా   ఆదాయాన్ని రాబట్టాలని చేసిన ప్లాన్ సక్సెస్  అవుతుంది. హైదరాబాద్ సమీపంలోని ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా బడ్జెట్ సపోర్టు పోందాలని భావించింది. అందులో భాగంగా సిటిలో మొదట భూముల వేలానికి శ్రీకారం చుట్టింది హెచ్ఎండిఏ. తాను డెవలప్ చేసిన కోకాపేట్ లే అవుట్ లో దాదాపు 50ఎకరాలను అమ్మడం ద్వారా 2వేల కోట్లు రాబట్టగా..., టీఎస్ఐఐసీ భూముల అమ్మకం ద్వారా 729కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తంగా 65 ఎకరాలను అమ్మడం ద్వారా జూలై నెలలో 2730కోట్ల వరకు ఆదాయం ప్రభుత్వ ఖజానకు  చేరింది. దాంతో నగరంలో హెచ్ఎండిఏ కు ఉన్న ఉప్పల్ భగాయత్ భూములను రెండు రోజులపాటు వేలం వేసింది. మొత్తం 44 ప్లాట్లలోని ఒక లక్షా 35వేల చదరపు అమ్మాలని  నిర్ణయించగా మొదటి రోజు 23 ప్లాట్లు అమ్మారు.  ఇందులో 150 చదరపుగజాల నుండి 1787 గజాల విస్తీర్ణం వరకు ఉన్న ప్లాట్లు అమ్మారు. మొత్తం 19,719 చదరపు గజాలు అమ్మగా..., 141కోట్ల 61లక్షల 30వేల రూపాయల ఆదాయం వచ్చింది. అత్యదికంగా ఒక గజం ధర 1లక్షా 1వేయ్యి రూపాయలు పలికింది.  అత్యల్పంగా 53వేల రూపాయలు గజం భూమి అమ్ముడు పోయింది. అలా సరాసరిగా గజం భూమికి 71వేల 815 రూపాయలు  వచ్చింది హెచ్ఎండీఏకు. రెండవ రోజు మాత్రం అత్యదికంగా 72వేల రూపాయలు... అత్యల్పంగా 36 వేల రూపాయలు చదరపు గజం ధర పలకగా.., సరాసరిగా 51,037 రూపాయలు ధర వచ్చింది. 

 

                 రెండవ రోజు 21పాట్లకు వేలం నిర్వహించగా మొత్తం 16ప్లాట్లు అమ్ముడు పోయాయి. ఇందులో 65,247 చదరపుగజాల స్థలాన్ని విక్రయించింది హెచ్ఎండిఏ. ఇందులో అత్యదికంగా 72వేల రూపాయలు చదరపు గజం ధర పలుకగా..., అత్యల్పంగా 36వేల రూపాయలు మాత్రమే ధర పలికింది. ఇలా మొత్తం 16 ప్లాట్ల అమ్మకం ద్వారా 333కోట్ల రూపాయల ఆదాయం హెచ్ఎండిఏ రెండువ రోజు సాధించింది. మొత్తంగా 44ప్లాట్లలో 39ప్లాట్లు అమ్మకానికి పెట్టగా రెండు రోజుల్లో కలిపి 474.61కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో మొత్తంగా 82,565చదరపు గజాల స్థలాన్ని రెండురోజుల వేలంలో హెచ్ఎండిఏ విక్రయించింది.  గతంలో ఇక్కడ ఉన్న రికార్డును బ్రేక్ చేస్తూ ఒక గజం ధర ఒక లక్షా  ఒక వెయ్యి రూపాయలు పలికింది. రెండవ రోజు మాత్రం అధి 72వేలు మాత్రమే ఉంది.  ఈ సారి నిర్వహించిన వేలంలో సరాసరిగా 55,859 రూపాయలుగా ఉప్పల్ భగాయత్ లే అవుట్ ధర నిర్ణయం అయ్యింది.  ఉప్పల్ భగాయత్ లే అవుట్ లోని ప్లాట్లలో చిన్న చిన్న విస్తీర్ణం ఉన్న ప్లాట్లు ఏక్కువ రేటుకు అమ్ముడు పోగా చాలా ఎక్కువ విస్తీర్ణం ఉన్నప్లాట్లు మాత్రం చాలా తక్కువ ధరకు అమ్ముడు పోయాయి.   222 గజాలు.., 368గజాల విస్తీర్ణం ఉన్న రెండు ప్లాట్లకు అత్యదికంగా ఒక గజం ధర 1 లక్ష ఒక వేయ్యి రూపాయలు ధర పలకగా..., 11,277 చదరపు గజాలు ఉన్న ఒక ప్లాటు గజం ధర కేవలం 36 వేల రూపాయలకు  మాత్రమే అమ్ముడుపోవడం విశేషం.