ఆస్తిపన్ను వసూళ్లు వేగవంతం చేయ్యండి

 

                      వెలవెలబోతున్న ఖజానా  నింపేందుకు  బల్దియా ఉన్నత అధికారులు కసరత్తు ప్రారంభించారు.  టార్గేట‌ర్ రిచ్ కావ‌డం కొసం ప‌నులన్ని ప‌క్క‌న పెట్టారు.   టైం టు  టైం రివ్యూ చేస్తూ టాక్స్ వ‌సూళ్లు చేయ్యాలంటూ క్షేత్రస్థాయిలో అధికారులపై ఒత్తిడి పెంచారు.    డిప్యూటీ కమీషనర్లు.., జోనల్  కమీషనర్లతో  కమిషనర్ లోకేష్ కుమార్ నేరుగా రివ్యూ చేస్తున్నారు.  ప్రతి సర్కిల్లో నోడల్ అధికారులు నియమించి పన్నువసూలు చెపడుతున్నారు.  టార్గెట్ రీచ్ కాకుంటే ఇంటికి వెళ్లాల్సిందే నంటూ ప్రదాన కార్యాలయం నుండి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  జిహెచ్ఎంసి వ‌చ్చే ఆదాయాల్లో ప్ర‌దానమైంది  ఆస్తిప‌న్ను. బ‌ల్దియా బ‌డ్జెట్కు  పెద్ద  మొత్తంలో స‌మ‌కూరేది కూడా ప్రాప‌ర్టీ టాక్సినే. దాంతో బిల్ క‌లెక్ట‌ర్ మొద‌లు కోని క‌మీష‌న‌ర్ వ‌ర‌కు  అంద‌రూ టాక్స్ క‌లెక్ష‌న్ల‌కు పెద్ద పీఠ వేస్తారు. ప్రతి ఏటా జ‌న‌వ‌రి వ‌చ్చిందంటే చాలు డే టు డే క‌లెక్ష‌న్ల‌పై ప‌డుతారు. కాని ఈ ఎడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది బల్దియాలో పరిస్థితి. ఖజానా ఖాళీ అవ్వడం..., కాంట్రాక్టర్లకు నెలల తరబడి పెండింగ్ లో బిల్లులు ఉండటంతోపాటు...., కార్మికులు ఉద్యోగులకు వేతనాలు జీతాలు కూడా కోన్ని సార్లు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.  చాలా సందర్భాల్లో ఇన్ టైమ్ లో జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. అయితే చాలా సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు బల్దియాకు. వాటి నుండి గట్టేక్కాలంటే పన్నువసూళ్లే లక్ష్యంగా పనిచేస్తున్నారు అధికారులు.

 

                        జిహెచ్ఎంసి ప్రదాన కార్యాలయం నుండి డేటుడే మానిటరింగ్ చేస్తున్నారు రెవిన్యూ విభాగం అధికారులు.   ప్రతి రోజు  ఉదయం 11 గంటలు అయ్యిందంటే చాలు ఫైనాన్స్ విభాగం అదనపు కమీషనర్.., కమీషనర్ ఇద్దరూ జోనల్ కమీషనర్లు.., డిప్యూటి కమీషనర్లతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. టార్గెట్లు రీచ్ కాని డిప్యూటి కమీషనర్లు జోనల్ కమీషనర్ల పై  ఫైనాన్స్ విభాగం అదనపు కమీషనర్  పన్నులు వసూళ్లు చేయ్యని వారిని ఇంటికి పంపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారట. గతేడాది వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా వచ్చిన పన్నును కూడా ఈ ఎడాది వసూళ్లలో కలపి దానిపై 20శాతం అధనంగా వసూలు చేయ్యాలంటూ  ఒత్తిడి తెస్తున్నారట. అవసరం అయితే నోడల్ అధికారులు.., బిల్ కలెక్టర్లకు మెమోలు జారీ చేయ్యాలని ఆదేశించారు బల్దియా ఉన్నతాదికారులు. నిత్యం ఇతర పనులతోపాటు..., కొర్టు కేసులు.., ఎమ్మెల్యేల విజిట్లతోపాటు ఉదయం ఆరుగంటల నుండే శానిటేషన్ పరిరక్షణ కోసం ఫీల్డ్ లో ఉంటున్నారు. నెలన్నరగా మొత్తం టాక్స్ వసూళ్లపై పడ్డారు. అయితే ఇంకా వసూలు చేయ్యాలంటూ ఒత్తిడి తేవడంపై లోలోపల ఇబ్బందులు పడుతున్నారు జోనల్ కమీషనర్లు..., డిప్యూటి కమీషనర్లు. అయితే  2020 - 21 ఆర్థిక సంవత్సరంలో  ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు మొత్తం 1171 కోట్లు వసూలు కాగా ఈ ఏడాది మాత్రం అది 996  కోట్లుగా ఉంది. అంటే దాదాపు  175 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది.  దాంతో ప్రతి సర్కిల్ వారీగా టాప్ బకాయిదారుల లిస్ట్ రెడీ చేసి వారి నుండి పన్ను వసూలు చేస్తున్నారు అధికారులు. ముందుగా వారికి నోటీసులు ఇవ్వడంతోపాటు దీర్ఘకాలంగా బకాయి ఉన్న వారి ఆస్తులు సీజ్ చేస్తున్నారు అధికారులు. అయితే గతేడాది దాదాపు 280 కోట్లవరకు పెండింగ్ టాక్స్  వసూలు అయ్యింది. ఈ ఎడాది దానిని కూడా కలుపుకోని మరో 20శాతం అధికంగా వసూలు చేయాలని చెప్పడంపై  అధికారులు అది ఎలా సాధ్యమంటూ లోలోపల ఆందొళనకు గురవుతున్నారు.  అయితే ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రావాల్సిన నిధుల విషయంలో కమీషనర్..., మరియు ఫైనాన్స్ విభాగం ఉన్నతాదికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటున్నాయి బల్దియా వర్గాలు. కాని క్షేత్రస్థాయి వారిపై మాత్రం ఒత్తిడి తెస్తున్నారని అంటున్నాయి.  

 

                  2021-2022ఎడాదిలో 1900కోట్లు వ‌సూలు చేయ్యాల‌ని ల‌క్ష్యాన్ని  పెట్టుకుంది జిహెచ్ఎంసి.   ఇక గ్రేటర్ ప‌రిధిలో దాదాపు  16ల‌క్ష‌ల మంది ఆస్తిపన్ను చెల్లింపులుదారులు ఉన్నారు.  వీటిలో క‌మ‌ర్సియ‌ల్ ఎస్టాబ్లిఫ్మెంట్స్  2లక్ష‌ల 50వేలు... కాగా మిగిలినవి రెసిడెన్సీయ‌ల్  ఆస్తులు.  అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఎరియ‌ర్స్ మ‌రియు వ‌డ్డి.. మరియు ఈఎడాది డిమాండ్  క‌లిపి మొత్తం ప్రాప‌ర్టీ టాక్స్ డిమాండ్ 2600కోట్ల వ‌ర‌కు ఉంటుంది.  అయితే ఆర్థిక కష్టాల నేపథ్యంలో వీలైనంత ఎక్కువ టాక్స్ వసూలు చేయాలని ప్లాన్ చేస్తుంది జిహెచ్ఎంసి.