ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు

  • పూతలపట్టు వైసీపీ అభ్యర్థిపై దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మరింత తాజా సమాచారం కోసం ఈ పేజీని బుక్‌మార్క్ చేసుకోండి)

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.

3.93 కోట్ల మంది ఓటర్లు మొత్తం 2,437 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 2,118 మంది.. 25 లోక్‌సభ స్థానాల్లో 319 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మే 23న ఫలితాలు వెలువడుతాయి.

ఇద్దరు మృతి

తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం కేఈ. చిన్నయ్యపాలెంలో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందారు.

విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తకోటలో ఓటు వేసేందుకు వెళ్తూ ఎండకు సొమ్మసిల్లి పడిపోయి కారెడ్ల సన్యాశిరావు (65) మృతి మృతి చెందారు.

మావోయిస్టుల మందుపాతరలను నిర్వీర్యం చేశాం: పోలీసులు

మావోయిస్టులు అమర్చిన మూడు శక్తిమంతమైన మందు పాతరలను నిర్వీర్యం చేసినట్లు విశాఖ పోలీసులు తెలిపారు. పెడబయలు మండలం సీకుపనస, మద్దిగరువు మధ్య అటవీ ప్రాంతంలో ఎన్నికల విధులు నిర్వహించే పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు మందు పాతరలను అమర్చారని జిల్లా ఎస్పీ అట్టడా బాబూజీ చెప్పారు.

15.36 వైసీపీ అభ్యర్థిపై దాడి

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కలకడ కట్టకింద పల్లి దగ్గర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ బాబుపై దాడి జరిగింది. వాహనం ధ్వంసమైంది. ఈ దాడి టీడీపీ కార్యకర్తలే చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు.

15.20. శ్రీకాకుళంలో ఉద్రిక్తత

శ్రీకాకుళంలోని బాలికల ఉన్నత పాఠశాల వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దాంతో, దుకాణాలను మూయించిన పోలీసులు ఘర్షణకు దిగిన వారిని చెదరగొట్టారు.

15.15 చంద్రగిరిలో ఉద్రిక్తత

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం కొత్త కండ్రిగలో వైసీపీ, టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురికి గాయాలయ్యాయి.

14.42 మధ్యాహ్నం 1గంట వరకు జిల్లాలవారిగా పోలైన ఓట్ల శాతం

శ్రీకాకుళం 37.92 %, విజయనగరం 53.19 %, విశాఖపట్నం 36.71 %, తూర్పుగోదావరి 41.21 %, పశ్చిమగోదావరి 37.51 %, కృష్ణా 36.42 %, గుంటూరు 36.08%, ప్రకాశం 41.48 %, నెల్లూరు 41.04 %, చిత్తూరు 42.60 %, కర్నూలు 40 %, కడప 43.92 %, అనంతపురం 38.80 %.

రాష్ట్రవ్యాప్తంగా పోలైన మొత్తం ఓట్ల శాతం 40.53 %

14:30 తూర్పుగోదావరి జిల్లాలో మావోయిస్టుల పేరుతో లేఖలు, పత్రాలుచింతూరు మండలం మల్లంపేట -నర్సింగ పేట గ్రామాల మధ్య, ఈ ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టుల పేరుతో లేఖలు, గోడపత్రాలు కనిపించాయి. అల్లిగూడెం పోలింగ్ కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ పోస్టర్లు కనిపించాయి. ప్రజలు మాత్రం, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్‌ల వద్దకు వెళుతున్నారు.

తాడిపత్రిలో ఘర్షణలో ఒకరు మృతి

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా ఎస్పీ జీవీ అశోక్ కుమార్ చెప్పారు.

13.35

Rammohan naidu శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు

13.00 పోలింగ్‌ను హిష్కరించి నిరసన

విశాఖలో 9వ వార్డుకు చెందిన 1,800 మంది ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించి నిరసన తెలిపారు. తమను భౌగోళికంగా దగ్గరగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో కలపాలని డిమాండ్ చెస్తున్నా, పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు.

12.30 జిల్లాల వారిగా 11 గంటల వరకు పోలింగ్ శాతం

రాష్ట్రంలో 11 గంటల వరకు 23.22 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

జిల్లాల వారీగా చూస్తే...

శ్రీకాకుళం 19.78%, విజయనగరం 31.57%, విశాఖపట్నం 21.64 %, తూర్పుగోదావరి 27.50%, పశ్చిమగోదావరి 20.41%, కృష్ణా 24.10 %, గుంటూరు 24 %, ప్రకాశం 22 %, నెల్లూరు 23.32%, చిత్తూరు 25.18 %, కర్నూలు 23%, కడప 17.84 %, అనంతపురం 21.47%.

  భీమవరంలో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన యువతులు

12.20 గుంటూరు జిల్లాలో ఘర్షణ

  టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చొక్కా చిరిగింది.

గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పోలింగ్ బూత్ పరిశీలిస్తుండగా తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో కోడెల చొక్కా చిరిగింది.

  పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామంలో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వృద్ధురాలు

12.10 "ఒక పార్టీ అభ్యర్థికి ఓటేస్తే మరో పార్టీ అభ్యర్థికి వెళ్తోంది"

"ఒక పార్టీ అభ్యర్థికి ఓటేస్తే మరో పార్టీ అభ్యర్థికి వెళ్తోంది" అంటూ పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈవీఎంలు మొరాయించడం ద్వారా మూడు గంటల పాటు పోలింగ్‌కు ఆటంకాలు ఏర్పడ్డాయని చంద్రబాబు పేర్కొన్నారు. కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కోరారు.

అయితే, రాజకీయ పార్టీల ఆరోపణలు నిరాధారమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు.

రీ పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. మొదట్లో పోలింగ్‌కు ఆలస్యం కావడం వల్ల మొదటి రెండు గంటల్లో పోలింగ్ శాతం తగ్గిందన్నారు. ఆరు చోట్ల ఈవీఎంలు పాడయ్యాయని, అందుకు సంబంధించి కేసులు నమోదు చేశామని తెలిపారు. 11 గంటల వరకు 15 శాతం పోలింగ్ నమోదు అయిందని చెప్పారు.

11.45

అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది.

11.40 ఈవీఎంను రీస్టార్ట్ చేశారు

పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోలనులో ఈవీఎం మొరాయించింది. 52 మంది ఓటు వేసిన తర్వాత ఆ ఈవీఎంను రీ స్టార్ట్ చేశారు.

దాంతో ఓట్లు తొలగిపోయాయంటూ ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం దగ్గరకు చేరుకున్న రిటర్నింగ్ అధికారులు.. బాధ్యులైన వీఆర్ఏను సస్పెండ్ చేశారు.

 ఆళ్లగడ్డలో ఘర్షణ

11.15 కర్నూలు జిల్లాలో ఘర్షణలు

అహోబిలంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భూమా, గంగుల వర్గీయిలు రాళ్లు రువ్వుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో తమ కుటుంబ సభ్యులెవరూ గాయపడలేదని మంత్రి అఖిలప్రియ అన్నారు.

11.05 రాప్తాడులో ఘర్షణ

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంతో వైసీపీ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దాంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. కొంత సేపు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిటాల శ్రీరామ్‌ను అక్కడి నుంచి పంపించారు.

11.00 నరసరావు పేటలో ఉద్రిక్తత

గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మండలం ఉప్పలపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్

10.54 పూతలపట్టులో ఉద్రిక్తత

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బందార్లపల్లెలో తెలుగుదేశం వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు.

10.20 తాడిపత్రిలో బారులు తీరిన ఓటర్లు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో

నర్సాపురంలో కేఏ పాల్

10.15 మంచు మోహన్ బాబు, మంచు విష్ణు

చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న మంచు మోహన్ బాబు, మంచు విష్ణు

కృష్ణా జిల్లా గన్నవరంలో క్యూ కట్టిన ఓటర్లు

9 గంటలు వరకు విశాఖపట్నం జిల్లాలో 7 శాతం, కడప జిల్లాలో 7.68 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

10.00 గుంతకల్ ఘటనపై స్పందించిన ఈసీ

అనంతపురం జిల్లా గుత్తి బాలికల కళాశాలలో పోలింగ్ ఏర్పాట్లు సరిగా లేవంటూ జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను ధ్వంసం చేశారు.

గుంతకల్‌లో జరిగిన పరిణామాలపై వెంటనే స్పందించామని, ప్రత్యామ్నాయ ఈవీఎంతో పోలింగ్ ప్రస్తుతం సజావుగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రమంతా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందన్నారు. ఈవీఎం సమస్యలు పరిష్కారిస్తున్నామని చెప్పారు. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతిస్తామన్నారు.

9.55 చిత్తూరు జిల్లా నగరిలో రోజా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకునేందుకు బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు వస్తున్న తరలివస్తున్న ఓటర్లు.

9.44 వైసీపీ కార్యకర్తపై దాడి

పశ్చిమ గోదావరి జిల్లా శనివారపుపేట పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ, వైసీపీ నాయకులు మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే బడేటి బుజ్జి, అనుచరులు వైసీపీ కార్యకర్తపై దాడి చేశారు.

9.35 అరుకులోయ

పోలింగ్ కేంద్రాల్లో కనీసం తాగు నీరు కూడా ఏర్పాటు చేయడకపోవడంతో ఉదయం నుండి బారులు తీరిన వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. మండుతున్న ఎండలకు కనీసం పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

BBC పులివెందులలో వైఎస్ జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

9.05 పులివెందులలో వైఎస్ జగన్

కడప జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ తన భార్య భారతితో కలిసివెళ్లి ఓటు వేశారు.

9.00 చంద్రబాబు, నారా లోకేశ్

ఉండవల్లి మండల పరిషత్ పాఠశాలలో ఓటుహక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ కుటుంబ సభ్యులు.

8.55 పాడేరులో ప్రారంభం కాని పోలింగ్

విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గంలోని గుడివాడ బూత్ నెం.273, 275, 271, పాత పాడేరులోని 281 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి.

8.50 ఈవీఎంను ధ్వంసం చేసిన జనసేన అభ్యర్థి

అనంతపురం జిల్లా గుత్తి బాలికల కళాశాలలో పోలింగ్ ఏర్పాట్లు సరిగా లేవని జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను ధ్వంసం చేశారు. దాంతో, పొలీసులు మధుసూదన్‌ను అరెస్టు చేశారు.

ఎమ్మెల్యే అభ్యర్థుల ఈవీఎం ఎక్కడుంది? ఎంపీలది ఈవీఎంలలో ఏది? అని ఓటర్లకు తెలిసేలా ఎక్కడా గుర్తులు పెట్టలేదని, పోలింగ్ బూత్‌లో బల్బులు కూడా ఏర్పాటు చేయలేదని బీబీసీతో మధుసూదన్ చెప్పారు.

కర్నూలులో

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని నార్లాపురం గ్రామంలో ఈవీఎం మొరాయించింది.

8.20 కుప్పంలో మొరాయించిన ఈవీఎంలు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. గుడిపల్లి మండలం శెట్టిపల్లి, బందార్లపల్లి, కుప్పం మండలంలోని పరమ సముద్రం, శాంతిపురం మండలంలోని ఎంకే పురం పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించాయి. పీలేరు పరిధిలోని 265వ పోలింగ్ కేంద్రంలోనూ ఈవీఎం మొరాయించింది.

పుంగనూరులో 36, 43,46, 55,56 పోలింగ్ కేంద్రాల్లోనూ ఈవీఎంలు పనిచేయలేదు.

  తిరుపతి నగరంలో పోలింగ్ తీరు

7.30 - 'రాష్ట్రవ్యాప్తంగా 50 ఈవీఎంలు మొరాయించాయి'

తాడేపల్లి క్రిస్టియన్ పేట మున్సిపల్ ప్రాధమిక పాఠశాలలో ఓటు వేసేందుకు వచ్చిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 50 ఈవీఎంలు మొరాయించాయని తెలిపారు. టెక్నీకల్ టీం వాటిని రిపేర్ చేస్తారని వివరించారు. ప్రజలు తమ ఓటు హక్కువినియోగించుకోవాలని, సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తామని ఆయన చెప్పారు.

7.00 - బారులు తీరిన ఓటర్లు

విశాఖపట్నం, కృష్ణా, కర్నూలు తదితర జిల్లాల్లో పోలింగ్ ప్రారంభమైన 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. బహుశా మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువ కావొచ్చుననే ఉద్దేశ్యంతో ఓటర్లు ఉదయంపూట ఓటు వినియోగించుకునేందుకు మొగ్గుచూపుతున్నారని అధికారులు భావిస్తున్నారు.

అంకెల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు

మొత్తం ఓటర్లు

3,93,45,717

పురుషులు

1,94,62,339

మహిళలు

1,98,79,421

ఇతరులు

3,957

పోలింగ్ కేంద్రాలు

45,920

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

9,000

పోలీస్ బలగాలు

1,20,000

  •