అమెరికాలో 33సెకన్లకు ఒకరు మృతి..

 

అమెరికాలో 33సెకన్లకు ఒకరు మృతి..

             అమెరికాలో కరోన తీవ్ర రూపం దాల్చీంది.  గడిచి వారం రోజులుగా  33 సెకన్లకు ఒకరు కరోనాతో మరణిస్తున్నట్లు  నివేదికలు చెబుతున్నాయి.    డిసెంబర్ 13 నుండి 20 వరకు  వైరస్‌ బారినపడిన వారిలో 18,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు వారంతో పోలిస్తే మరణాల రేటు 6.7 శాతం పెరిగినట్లు చెబుతున్నాయి లెక్కలు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయాని ప్రయాణాలు మానుకోవాలి అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా..  శుక్ర, శని, ఆదివారాల్లో అమెరికాలోని  విమానాశ్రయాల్లో 3.2 మిలియన్ల ప్రజలు ప్రయాణాలు చేశారు.  

                 అమెరికాలోని పలు  ఆసుపత్రులు కరోనా రోగులతో నిండాయి. మొత్తం కేసుల సంఖ్య దాదాపు 1.5 మిలియన్లకు చేరింది. టెన్సిసీ, కాలిఫోర్నియా, రోడ్ ఐలాండ్ రాష్ట్రాల్లో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.   దేశంలోని 50 రాష్ట్రాల్లో 31 రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల శాతం 10 శాతానికిపైగా ఉంది. అయోవా, ఇదాహోలో అత్యధికంగా 40 శాతం పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు చెప్పారు అధికారులు.