అతిక్రమణలపై @CEC_EVDM ట్విట్టర్ లో  ఫిర్యాదు

గ్రేటర్ హైదరాబాద్ లో డిఫెస్మెంట్ యాక్టును  పకడ్బందీగా అమలు చేస్తున్న జీహెచ్ఎం ఎన్పొర్స్మెంట్ విభాగం 40వేల వరకు అతిక్రమణలను గుర్తించి... 20కోట్ల వరకు ఫైన్లు వేశారు. ఇప్పటి వరకు ఎన్పోర్స్మెంట్ విభాగం అధికారులు సిబ్బంది సెంట్రల్ ఎన్పోర్స్మెంట్ యాప్  అతిక్రమణలను గుర్తించి ఫైన్లు వేస్తున్నారు. ఇక నుండి  అతిక్రమణలను సిజన్స్ కూడా బల్దియా ద్రుష్టికి తెవచ్చంటున్నారు అధికారులు.  ఎక్కడ పడితే అక్కడ  అనధికారికంగా పోస్టర్లు, బానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు.., వాల్ రైటింగ్ లు.., నిర్మాణ వ్యర్థాలు రోడ్లపై.. నాలాల్లో.. చెరువుల్లో వేయ్యడం వంటి అంశాలపై   క్లియర్ ఫొటోలతో @CEC_EVDM ట్విట్టర్ లో  ఫిర్యాదు చేయవచ్చునని ఈవిడియం డైరెక్ట‌ర్‌  సూచించారు. పౌరులు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫిర్యాదులపై సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ సోషల్ మీడియా ఉద్యోగులు స్పందించి, ఇ-ఛ‌లాన్‌ జనరేట్ చేస్తారన్నారు.  సి.ఇ.సి సోష‌ల్ మీడియా ఉద‌యం 10గంట‌ల నుండి సాయంత్రం 6గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తుంద‌ని...,  6గంట‌ల త‌ర్వాత వ‌చ్చిన ట్విట్ట‌ర్ పోస్టుల‌పై మ‌రుస‌టి రోజు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. నిబంధ‌న‌ల అమ‌లులో పౌరుల భాగ‌స్వామ్యాన్ని పెంచుట‌కే ట్విట్ట‌ర్ ఖాతాను ఏర్పాటు చేశామంటున్నాయి బల్దియా వర్గాలు.