మా వేతనాలు పెంచండి-డ్రైవర్లు

 

 మా వేతనాలు పెంచండి జిహెచ్ఎంసి డ్రైవర్లు

                     గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్మికులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీవో ను జారీ చేసింది. శానిటేషన్..., మలేరియా విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు 17వేలకు  వేతనాన్ని పెంచింది ప్రభుత్వం. కోన్ని విభాగాలకు వేతనాల పెంచిన అధికారులు మరికోన్ని విభాగాలలను వదిలేయ్యడంతో వారు ఆందోళనకు దిగుతున్నారు కార్మికులు. 

 

                         జిహెచ్ఎంసి లో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులు..., ఎంటమాలజీ విభాగంలో పనిచేస్తు వర్కర్ల తోపాటు ఆయా విభాగాల సూపర్ వైజర్లకు వేతనాలు పెంచుతామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు ముఖ్యమంత్రి కేసిఆర్. అందుకు అనుగుణంగా కోద్ది రోజుల క్రితం ప్రభుత్వం జీవో 610 జారీ  చేసింది. అందులో భాగంగా 14 వేల నుండి  17వేల కు వేతనాన్ని పెంచుతు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఎంటమాలజీ కార్మికులకు..., శానిటేషన్ కార్మికులకు 17వేలు పెంచగా..., అందులో పనిచేస్తున్న సూపర్ వైజర్లుకు మరో 500అధికంగా అంటే 17,500లకు పెంచారు.

                       జిహెచ్ఎంసి ట్రాన్స్ పోర్టు విభాగంలో హెల్పర్లుగా  పనిచేసే వర్కర్లకు మాత్రం 17వేల రూపాయలు చేసిన ప్రభేుత్వం. అందులో పనిచేసే డ్రైవర్లకు మాత్రం  వేతనాలు పెంచలేదు. దాంతో డ్రైవర్ కు హెల్పర్ గా నిచేసే కార్మికుడికి మాత్రం 17వేలు చేల్లిస్తున్న అదికారులు..., బండి నడిపే డ్రైవర్ కు మాత్రం 15వేలనే చెల్లిస్తున్నారు. హెల్పర్ కు రెండు వేలు అధికంగా ఇవ్వడం మంచిదే కాని తమకు తక్కువ ఇవ్వడం ఎంటనీ ప్రశ్నిస్తున్నారు కార్మికులు. తమకు వేతనాన్ని పెంచాలాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల మద్య విభజన చేసి ఒకరికి ఒక విధంగా మరోకరికి మరోక వేతనం  ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కార్మిక నేతలు. సమాన పనికి సమాన వేతం ఇవ్వాలని డిమాండ్  చేశారు. జిహెచ్ఎంసి లో  అన్ని విభాగా కార్మికులు పనిచేయ్యడం ద్వారానే నగరం శుభ్రంగా ఉంటుందంటున్నారు. 

                      బల్దియాలో పనిచేస్తున్న 27వేల మంది కార్మికుల్లో 24వేల మంది కార్మికులకు వేతనాలు పెరగగా మరో మూడు వేల మంది వరకు వేతనాలు పెరుగాల్సిన కార్మికులు ఉన్నారు. ఇ అంశాన్ని మేయర్ దృష్టికి తీసుకు వేళ్లారు కార్మికులు.