నో పే నో వర్క్  -GHMC కాంట్రాక్టర్లు.

 

                     నో పే - నో వర్క్   గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.  ఆదాయం తగ్గిపోయవడం ఖర్చులు పెరిగిపోవడంతో సమస్యలు మరింతగా ఎక్కువ అయ్యాయి. కరోనా టైం...  వరదలు..., ఎన్నికలు ఇలా    వచ్చే  ఆదాయానికి గండికోట్టాయి. పన్నులు వసూలు కాకపోవడంతోపాటు..., కరోనా... వరదలు అంటూ ప్రభుత్వం పన్నుల్లో రాయితీ ఇవ్వడంతో బల్దియా ఆర్తిక స్థితిపై మరింతగా ప్రభావం పడింది.

                  ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బల్దియా అధికారులు మెయింటెనేన్స్  బిల్లులు కూడా చెల్లించడం లేదు. ఆగస్టు నుండి కోందరికి అంతకంటే ముందునుండి మరికోందరికి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. బల్దియా మెయింటెనేన్స్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు  ఎకంగా నాలుగు వందల కోట్ల వరకు బకాయి పడింది జిహెచ్ఎంసి. అప్పటి నుండి ఇప్పటి వరకు కాళ్లావేళ్లా పడుతు వచ్చిన కాంట్రాక్టర్లు ఇక బిల్లులు చెల్లిస్తే పనులు చేస్తాం లేదంటే  చేయ్యలేమంటు అల్టీమెటం జారీ చేశారు. ఇప్పటికే సర్కిల్ కార్యాలయాల వద్ద నిరసనలు దర్నాలు నిర్వహిస్తున్నారు.

            బ‌ల్దియాను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.   రోడ్లు..., నాలాలు.., పార్కులు.., స్మశాన వాటికలు.., ఫుట్ పాత్ లు.., సీసి రోడ్లు నిర్మాణం.., కార్యాలయాల నిర్మాణాలు వంటివాటితో పాటు ఇతర మెయింటెనేన్స్ ప‌నులు పూర్తి చేసి నెల‌లు గ‌డుస్తున్న త‌మ‌కు బిల్లులు చెల్లించ‌డం లేద‌ని వాపోతున్నారు కాంట్రాక్ట‌ర్లు. మొత్తంగా 400కోట్ల బిల్లు పైనాన్స్ విబాగం వ‌ద్ద పెండింగ్ లో ఉన్న‌ట్లు చెబుతున్నారు కాంట్రాక్టర్లు.   బిల్లులు చెల్లించ‌కుంటే తామూ ప‌నులు నిలిపి వేస్తామంటూ ఆల్టీమేటం జారీ చేశారు కాంట్రాక్ట‌ర్లు. 2016నుండి  కాంట్రాక్టర్లకు బిల్లులు విషయంలో...  మరో జిహెచ్ఎంసి కార్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్ట్  ఎంప్లాయిస్ కు వేతనాలు సరైన సమయంలో ఇవ్వడం లేదు  జిహెచ్ఎంసి.