కారు జోరుకు బ్రేకులు..

 కారు జోరుకు బ్రేకులు..

 బిజేపి 48సీట్లు..

 పట్టునిలుపుకున్న ఎంఐఎం.. 

 బల్దియాలో హాంగ్ తప్పదా..?

       గ్రేటర్ హైదారబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు జరిగిన సాదరణ  ఎన్నికల్లో కారు జోరుకు బ్రేకులు పడ్డాయి. 2016పాలక మండలిలో 99స్థానాలు సాదించిన టిఆర్ఎస్ ఇప్పుడు 44స్థానాలు కోల్పోయింది. కేవలం 55స్థానాల్లో విజయం సాధించగా..., నెరేడ్ మెట్ స్థానం పెండింగ్ లో ఉంది. 2016లో నాలుగు స్థానాలున్న బిజేపి ఇప్పుడు 44స్థానాలు సాధించి మొత్తం 48సీట్లను కైవసం చేసుకుంది. బిజేపి  గెలిచిన స్థానాల్లో మొత్తం టిఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. 

 

             ఇక కాంగ్రేస్ పార్టీ గతంలో 2స్థానాలు ఉండగా ఈ సారి కూడా ఆ  రెండు స్థానాలను నిలుపుకుంది. నగరంలో కాంగ్రేస్ కు ఒట్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇక మజ్లీస్ పార్టీ తన పట్టును కోనసాగించింది. చార్మినార్ జోన్ తో పాటు..., ఖైరతాబాద్ జోన్ లో కూడా ఎక్కువ స్థానాలు సాధించింది. 

 

          టిఆర్ఎస్ పార్టీని వరదల్లో ముంచాయి ఈ ఎన్నికలు. ఎన్నికలకు కోద్ది వారాల క్రితం భారీగా వచ్చిన వరదలు  నట్టేటా ముంచాయంటున్నారు విశ్లేషకులు. ప్రదానంగా వరదలు వచ్చిన ప్రాంతాల్లో ఎక్కువగా ఒటమిని చవిచూసిందంటున్నారు. అయితే మజ్లీస్ పార్టీ విషయంలో అదిజరిగినట్లు కనిపించడం లేదు. అంటే టిఆర్ఎస్ పార్టీ పట్ల... వారు ప్రకటించిన అభ్యర్థుల పట్ట ఉన్న వ్యతిరేఖతే టిఆర్ఎస్ పార్టీ గోరపరాజయానికి కారణం అనే వాదనలు ఉన్నాయి.