తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ శాతం..?

దేశవ్యాప్తంగా మొదటి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగింపుకు వచ్చింది . ఆంధప్రదేశ్‌, తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు సంబంధించి పోలింగ్‌ జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో ఈరోజు ఎన్నికలు నిర్వహించారు.

తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలింగ్‌ శాతం చూస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 54 శాతం, తెలంగాణలో 48.95 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీగా చూస్తే ..

* శ్రీకాకుళం 54 శాతం
* విజయనగరం 63 శాతం
* విశాఖ 51 శాతం
* తూర్పుగోదావరి 52 శాతం
* పశ్చిమగోదావరి 50 శాతం
* కృష్ణా 51 శాతం
* గుంటూరు 50 శాతం
* ప్రకాశం 58 శాతం
* నెల్లూరు 53 శాతం
* చిత్తూరు 57 శాతం
* కర్నూలు 40 శాతం
* కడప 63 శాతం
* అనంతపురంలో 53 శాతం పోలింగ్‌ నమోదైంది.

తెలంగాణ విషయానికి వస్తే..

* హైదరాబాద్‌ 27.79శాతం
* మల్కాజ్‌గిరి 36.39శాతం
* చేవెళ్లలో 40.45 శాతం
* ఆదిలాబాద్‌ 57.04 శాతం
* నిజామాబాద్‌ 45.29 శాతం
* జహీరాబాద్‌ 63.39 శాతం
* నాగర్‌కర్నూలు 62.21 శాతం
* కరీంనగర్‌ 58.1 శాతం
* పెద్దపల్లి 54.83 శాతం
* నల్గొండ 57.41 శాతం
* భువనగిరి 57.41 శాతం
* వరంగల్‌ 51.50 శాతం
* మహబూబాబాద్‌ 55.24 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.