కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ఫైన్....

సినీ నటుడు మోహన్ బాబు కు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. మోహన్‌బాబు నిబంధనలకు విరుద్ధంగా తన నివాసానికి హోర్డింగ్‌ పెట్టడమే కాకుండా దానికి లైటింగ్‌ అమర్చినందువల్లే ఫైన్‌ వేసినట్లు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1లోని తన ఇంటి ఆవరణలో సినిమా ప్రకటన బోర్డును మోహన్‌బాబు ఏర్పాటు చేశాడు. అయితే నిర్దేశించిన ప్రమాణాలకు మించి 15 అడుగుల ఎత్తులో ఈ బోర్డును పెట్టారని అధికారులు ఆయనకు పంపించిన నోటీసులో పేర్కొన్నారు. ఈ బోర్డు పెట్టేందుకు కనీసం అనుమతి కూడా తీసుకోలేదని వెల్లడించారు.