IRC నిభందనలకు విరుద్దంగా స్పిడ్ బ్రేకర్లు

 

  

                      నగరంలో ఎంత మంచి రోడ్డు అయినా, మరెంత మంచి వాహనం అయినా కనీసం వంద.. రెండు వందల మీటర్లుకోకసారి వాహనం బ్రేక్ కావాల్సిందే, ఆద‌మ‌రిచారంటే  అంతే సంగ‌తులు. వాహ‌నంతో పాటు ఒళ్లు గుళ్ల‌కావాల్సిందే.  ఎక్కడ గుంత ఉందో..,  ఎక్కడ ఎత్తు ఉందో తెలియని పరిస్థితి.  చాలా ప్రాంతాల్లో  ఇష్టం వచ్చినట్లుగా స్పిడ్ బ్రేకర్స్ నిర్మించారు బల్దియా అధికారులు.   హైదరాబాద్ లో ఏలాంటి రూల్స్ , రెగ్యులేషన్స్ లేకుండా నిర్మించిన స్పిడ్  బ్రేకర్స్ వాహ‌న‌దారుల న‌డ్డి విరుస్తున్నాయి. రోడ్లపై వాహానాలు అతి వేగంగా వేళ్లకుండా నియంత్రించేందుకు ఉపయోగించేవే స్సిడ్ బ్రేకర్స్.  ప్రమాదాల నివారణకు, వేగనియంత్రణకు ఉపయోగించే స్పిడ్ బ్రేకర్స్ నగరంలొ విచ్చలవిడిగా వున్నాయి.  రోడ్ల పైన మాత్రమే కాకుండా సందుగోందుల్లోను ఎత్తైన స్పిడ్ బ్రేకర్స్ మనకు దర్శనమిస్తాయి. ఎవ్వరి ఇష్టం వచ్చినట్లు వారు తమ తమ ప్రాంతాల్లో స్పిడ్  బ్రేకర్లు నిర్మిస్తున్న సందర్బాలున్నాయి.  కోన్నిప్రాంతాల్లొ కిలొమీటరు పరిధిలో 15 నుండి 20వరకు ఉంటే మరికోన్ని ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువే ఉన్నాయి . గ్రేటర్ మొత్తం లో 15వేల వ‌ర‌కు స్పిడ్ బ్రేక‌ర్స్ ఉంటాయ‌ని అంచనా. 

 

                 హైదరాబాద్ నగరంలో ప‌లు చోట్ల‌ ఆకతాయిలు వాహనాలపై రైయ్యిమంటు దుసుకెళ్తూ తోటి వాహ‌న‌దారుల‌కు ,  పాదా చారుల‌కు  ఇబ్బందులు సృష్టిస్తున్నారు. అంతే కాక అనేక ప్రమాదాలకు సైతం కారణం అవుతున్నారు. వీరిని నియంత్రించాడానికి స్పిడ్ బ్రేకర్స్ అవసరమవుతున్నాయి.   ఇవి రోడ్డు ప్రమాదాలను నియంత్రించడాని ఉపయోగ పడటం ఎంత వాస్తవమో..., నిర్మాణంలో ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదాలకు కారణం అవుతాయనేది అంతే నిజం. ఎలాంటి ప్ర‌మాణాలు లేకుండా   ఎత్తుగా ఉండటం, ముందు స్పిడ్ బ్రేకర్ ఉందన్న సూచీలు లేకపోవడంతో ప్రమాదాలు నివారించే స్పిడ్ బ్రెక‌ర్స్ వ‌ల్లే  హైద‌రాబాద్లో ప్ర‌మాదాలు  జరుగుతున్నాయి. ఇటివల హయత్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో బైక్ పై వెళ్తున్న దంపతులు స్పిడ్ బ్రెకర్ ప్రమాదానికి గురయ్యారు. క్రిందపడి మహిళ మృతి చెందింది. భర్త హెల్మెట్ ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో స్పిడ్ బ్రేక‌ర్స్  ను నిర్మిస్తుంది జిహెచ్ఎంసి. ఇండియాన్ రోడ్డు కాంగ్రేస్ నిబంద‌ల‌కు అనుగుణం  స్పిడ్ బ్రేక‌ర్స్ నిర్మించాలి.  కాని అందుకు అనుగుణంగా రోడ్డు నిర్మాణా జరగడంలేదనే ఆరోపణలున్నాయి.  అసలు స్పిడ్ బ్రేకర్స్ ఎలా ఉండాలి.., ఎంత ఎత్తు ఉండాలి.., ఎంత వెడ‌ల్సు ఉండాల‌నే అంశంపై  ఇండియ‌న్ రోడ్డు కాంగ్రేస్ కోన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు  రూపోందించింది.  కాని  ఆనిభంద‌న‌ల‌ను  గ్రేట‌ర్ అధికారులు గాలికి వ‌దిలేశారు. దాంతో  ఎలా ప‌డితే అలా  స్పిడ్ బ్రేక‌ర్ నిర్మిస్తున్నారు అధికారులు. క‌నీసం ఏట‌వాలు పాటించ‌డం లేదు. నీటిని నిలువ‌రించే క‌ట్ట‌లుగా వాటిని నిర్మిస్తున్నారు.  ప్ర‌మాదాల‌ను నియంత్రించాల్సిన స్పిడ్ బ్రేక‌ర్స్ ప్ర‌మాదాల‌కు కార‌ణం అవుతున్నాయి అంటున్నారు సిటిజన్స్

 

                   సాధరణంగా స్పిడ్ బ్రేకర్స్ రెండున్నర మీటర్ల వెడల్పు వుండాలని ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ చెబుతుంది. వాటిపై వైట్ పెయింట్ చారలు వేయ్యాలి.  స్పిడ్ బ్రెకర్ కంటే ముందు 40మీట‌ర్ల‌ దూరంలో సూచిబోర్డులు ఏర్పాటు చేయ్యలి. ఇలా చేసినప్పుడు ప్రమాదాలు జరుగవు, వాహనాలు దెబ్బతినవు పౌరుల ఆరోగ్యం బాగుంటుంది.  వివిధ ప్రాంతాల్లో ఉండే రోడ్ల‌ను బ‌ట్టి  స్పిడ్ బ్రేక‌ర్స్ నిర్మాణం వేరు వేరుగా ఉంటుంది. అంత‌ర్జాతీయ న‌గ‌రం అంటున్న    మ‌న హైద‌రాబాద్ లో ఎక్క‌డా ఇలాంటి  ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.  స్పిడ్ గా వెళ్తున్న వ‌హానాదారులకు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే వ‌ర‌కు  స్పిడ్ బ్రేక‌ర్స్ క‌న‌బ‌డ‌వు. ఒక్క‌సారిగా బ్రేక్ వేయ్య‌డం వ‌ల్ల వేన‌క వ‌చ్చే వాహ‌న‌దారులు కూడా ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు.  వాహనలు స్పిడ్ బ్రేకర్స్ పై కుదుపులకు గురికావడం వల్ల త్వర, త్వరగా వాహనాలు రిపేరుకు వస్తాయి. షాక్ బ్ అబ్జార్ వర్స్, సస్ పెక్షన్, బుసెస్, డిస్క్ లు, బ్రేక్స్ తో పాటు మైలేజి కూడా తగ్గుతుంది. వాహనాలకే కాదు వాహ‌దారుల‌ ఆరోగ్యం పై కూడా ప్ర‌మాదం ప‌డుతుంది.  వైద్యులు. నడుము, భుజాలు, మెడపై వత్తిడిపడుతుంది. గర్భందాల్చిన తోలిదశలో బ్రేకర్స్ కుదుపువల్ల గర్భస్రావం కావచ్చు, చివరి దశలో అయితే మరింత ప్రమాదాం అంటున్నారు వైద్యులు. అంతే కాదు ఇవి ఉన్న ప్రాంతలలో మాములు రోడ్డుపై వుండే కాలుష్యం కంటే కోన్నిరేట్లు ఎక్కువ కాలుష్యం వెలువడుతుంది. వ‌రల్డ్ క్లాస్ సిటి అంటున్న గ్రేట‌ర్ అధికారులు రోడ్ల‌పై ఉన్న స్పిడ్ బ్రేక‌ర్స్ నిర్మాణంలో ప్రమాణాలు పాటించాల‌ని అవసరం ఉంది.

 

                  వేగ‌ నియంత్ర‌ణ ద్వారా  ప్ర‌మాదాలను అరిక‌ట్ట‌డానికి  ఎర్పాటు చేసిన స్పిడ్ బ్రేక‌ర్స్   ప్ర‌మాదాల‌కు నెల‌వుగా మారాయి. వాటిని ప‌ట్టించుకోవాల్సిన   అధికారులు మాత్రం నిమ్మ‌కు నిరేత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికై అధికారులు ప్ర‌మాణాల ప్ర‌కారం స్పిడ్ బ్రేక‌ర్స్ ను నిర్మించాల‌ని ఆశిద్దాం.