GHMC ఆస్తులు ద్వంసం సరికాదు..

                   గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్  కార్పోరేషన్ లో  కార్పొరేటర్ల రసాబాస కొనసాగుతుంది. బుదవారం టిఆర్ఎస్ కార్పోరేటర్లు మేయర్ కార్యాలయాన్ని పాలతో శుద్ధి చేశారు. కార్పోరేషన్ ఆస్తులు ద్వంసం చేసిన వారికి పై చర్యలు తీసుకోవాలని మేయర్ కు కమిషనర్ బిజెపి కార్పోరేటర్లపై  ఫిర్యాదు చేశారు.  అయితే తాము కార్యాలయం పై దాడి చేయ్యలేదని..., పోలిసుల తోపులాల్లోనే పూల కుండిలి పగిలిపోయాన్నారు బిజేపి కార్పోరేటర్లు. తమపై కేసులు నమోదు చేసినా భయపడేది లేదని..., సిజన్ సమస్యలపై పోరాటం అపేదిలేదన్నారు.

 

          బల్దియాలో కార్పోరేటర్ల ఎపిసోడ్ రెండో రోజు కూడా కొనసాగింది.  మంగళవారం బిజేపి కార్పోరేటర్లు బల్దియా కార్యాలయం వద్ద నిరసర వ్యక్తం చేశారు. సిటిలో  ఉన్న సమస్యలపై చర్చించేందుకు జిహెచ్ఎంసి పాలకమండలిని సమావేశ పరచాలి... కార్పోరేటర్లుకు నిధులు విడుదల చేయ్యాలని డిమాండ్ చేశారు. అయితే అధికారులు స్పందించపోవడంతో కార్యాలయంలోకి చోచ్చుకు వెళ్లాయి బిజేపి శ్రేణులు. వారిని నిలువరించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో తోపులాటలు జరుగుతూ కోన్ని మొక్కలు.. పూల  కుండిలు పాయ్యాయని బిజేపి శ్రేణులు అంటుండగా..., కావాలని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారని మండిపడ్డారు టిఆర్ఎస్ కార్పోరేటర్లు..

 

           మంగళవారం బిజేపి చర్యలను నిరసిస్తూ ఈ రోజు జిహెచ్ఎంసి కార్యాలయంలో పాలతోశుద్ది చేశారు టిఆర్ఎస్ కార్పోరేటర్లు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హాక్కు అందరికి ఉందని..., అయితే అధి భౌతిక దాడులకు దారి తీయవద్దని హితవు పలికారు టిఆర్ఎస్ కార్పోరేటర్లు. తాము చేయ్యాలను కుంటే  బిజేపి కార్పోరేటర్ల కంటే ఎక్కువ చేస్తామన్నారు మాజి డిప్యూటి మేయర్ బాబా ఫిసియుద్దీన్. ఒక బహుజన మహిళ మేయర్ ను  అవమానించే విధంగా బిజేపి వ్యవహరించిందని అన్నారు.