GHMCకి హడ్కో అవార్డు - అభినందించిన మంత్రి కె.టి.ఆర్

                       

             రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పేదల ఆత్మగౌరవ ఇళ్లకు జాతీయ స్థాయిలో హడ్కో బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు లభించినందుకు అధికారులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అభినందించారు. శనివారం ప్రగతి భవన్ లో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, గృహనిర్మాణ విభాగం ఓ.ఎస్.డి సురేష్ కుమార్ లు మంత్రి కె.టి.ఆర్ ను కలిసి హడ్కో అవార్డు గురించి వివరించారు. నగరంలో పేదల ఆత్మగౌరవానికై రూ. 8598 కోట్ల నిధులతో ఒక లక్ష రెండు పడగ గదుల ఇళ్లను మంజూరు చేసినందుకు మంత్రి కె.టి.ఆర్ కు అధికారులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వినూత్న సాంకేతిక ప‌రిజ్ఞానంతో గేటెడ్ కమ్యునిటీ అపార్ట్ మెంట్లు, ఇళ్లకు ధీటుగా  అన్ని మౌలిక వసతులతో నాణ్యతతో నిర్మిస్తున్న అధికారులను మంత్రి అభినందించారు.