జాతీయ పండు..ఆరోగ్యానికి మెండు,మామిడి పండు..

పువ్వులో రాణి గులాబీ,కూరల్లో రాజా వంకాయ, మరి పండ్లల్లో మహారాజు ఎవరయా అంటే ఇట్లే చెప్పేస్తారు. అదేనండీ! మామిడి పండు. అందుకే అది మన జాతీయ ఫలం అయ్యింది. ప్రపంచంలోని, ఉష్ణమండదేశాల్లో, విస్తారంగా పండించబడే అతి ముఖ్యమైన ఫల పంట మామిడి యొక్క పండు శరీరానికి ఎంతోమేలు చేసే పండు ఇది. నేరుగా పండులా తినవచ్చు లేదా ఊరగాయలు మొదలైన వాటికి పచ్చడి మామిడి కాయలను ఉపయోగించవచ్చు. దీనిలో రసం కలిగిన పండు విటమిన్లు ఎ, సి, డి లను పుష్కలంగా కలిగి ఉంది. భారతదేశంలో వంద రకాలకు పైగా మామిడి ఎన్నో రకాల సైజుల్లో లభ్యమౌతుంది. చిరకాలం నుండి మామిడి భారతదేశంలో సాగు చేయబడుతుంది. ప్రముఖ కవి కాళిదాసు, తన కవిత్వంలో ఈ పండు యొక్క ప్రాశస్యాన్ని ఘనంగా కీర్తించాడు. జగజ్జేతగా పేరొందిన అలెగ్జాండరు, చైనీయుల యాత్రికుడైన హ్యూయాన్ ల్సాంగ్ కూడా దీని రుచిని ఆస్వాదించి మైమరచిపోయారు. మొఘల్ చక్రవర్తి అక్బర్, 1,00,000 మామిడి చెట్లను బీహార్ లోని దర్భాంగా లో నాటించాడు. ఇప్పుడు ఆ తోట, లఖీబాగ్ అని పిలవబడుతుంది. మరి దీని ఘనతో ఏమిటో తెలుసుకున్నాం..మరి దీని ఉపయోగాలేమిటో..లాభాలేమిటో..ఆ ఆస్వాదన ఏమిటో తెలుసుకుందాం..