2020 - 21 బల్దియా బడ్జెట్  6,973 కోట్ల‌ ​

2020 - 21 బల్దియా బడ్జెట్  6,973 కోట్ల‌ 

జీహెచ్ఎంసీ 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.   6,973 కోట్ల‌ ​తో ప్ర‌వేశ‌పెట్టిన‌ బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌ను నేడు జ‌రిగిన స్టాండింగ్ క‌మిటి ఆమోదించింది.  న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స్టాండింగ్ కమిటి స‌మావేశానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు చెరుకు సంగీత‌, స‌మీనా బేగం, మ‌హ్మ‌ద్ అబ్దుల్ రెహ‌మాన్‌, మ‌హ్మ‌ద్ ముస్తాఫా అలీ, మిస్ బా ఉద్దీన్‌, ఎం.మ‌మ‌త‌, ఎక్కెల చైత‌న్య క‌న్న‌,మ‌హ్మ‌ద్ అఖిల్ అహ్మ‌ద్‌, తొంట అంజ‌య్య‌, స‌బీనా బేగం, సామ‌ల హేమ‌, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. 2020-21 సంవ‌త్స‌రానికి  బ‌డ్జెట్ ప్రతిపాద‌న‌ల‌ను న‌వంబ‌ర్ 14వ‌ తేదీన జ‌రిగిన స్టాండింగ్ క‌మిటిలో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బ‌డ్జెట్ పై నేటి స్టాండింగ్ క‌మిటీ స‌మావేశంలో విస్తృతంగా చ‌ర్చించి ఆమోదించారు. అనంత‌రం ఈ బ‌డ్జెట్‌ను జ‌న‌ర‌ల్ బాడి స‌మావేశంలో చ‌ర్చించి తుది బ‌డ్జెట్‌ తీర్మానాన్ని జిహెచ్ఎంసి జ‌న‌ర‌ల్ బాడి స‌మావేశంలో ఫిబ్ర‌వ‌రి 20వ తేదీలోపు ఆమోదించి ప్ర‌భుత్వ అనుమ‌తికై మార్చి 7వ తేదీ వ‌ర‌కు పంపించాల్సి ఉంటుంద‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్‌కుమార్‌ స్టాండింగ్ క‌మిటికి తెలియజేశారు. 2020-21 బ‌డ్జెట్ వివ‌రాలు...

2020-21కు ప్ర‌తిపాదిత ముసాయిదా బ‌డ్జెట్ మొత్తం రూ. 5380 కోట్లు
మేజ‌ర్ ప్రాజెక్ట్‌ల‌కు ప్ర‌తిపాదిత బ‌డ్జెట్ మొత్తం రూ. 1593 కోట్లు