19.40 కోట్లతో  5 ఫిష్ మార్కెట్లు

              ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నగరంలో అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా కనీస అవసరాలైనా స్వచ్ఛమైన నాణ్యమైన కూరగాయలు, మాంసాహారం చేపలు ఒకే చోట దొరికే విధంగా   అన్ని వసతులతో కూడిన మోడల్ మార్కెట్ల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు  జిహెచ్ఎంసి కృషి చేస్తున్నది..

       నగరంలో రోడ్ల పై వ్యాపారులు తమ కార్యకలాపాలు చేస్తుండటం వలన ట్రాఫిక్  సమస్య ఎక్కువగా ఎదురౌతుంది తద్వారా రవాణాకు ఆటంకం కలుగుతుంది. ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని నగరంలో  ప్రజల అవసరాలకు అనుగుణంగా  నిర్దేశిత ప్రదేశాలను గుర్తించి మోడల్ మార్కెట్ల నిర్మాణాలను చేపట్టింది. అందులో భాగంగా జిహెచ్ఎంసి అధ్వర్యంలో   19.40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో  5 ఫిష్ మార్కెట్లను చేపట్టింది. అందులో నాచారం, కూకట్ పల్లి  మార్కెట్ లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మల్లాపూర్, బేగంబజార్  రెండు మార్కెట్ల పనులు పురోగతిలో ఉన్నాయి.  వాటిని నిర్దేశించిన కాలవ్యవధిలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నది జిహెచ్ఎంసి