10లక్షల మందికి కరోనా

10లక్షల మందికి కరోనా 

50వేలమంది బలి

వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి

                        మహమ్మారి కరోనా ప్రంపచాన్ని వణికిస్తుంది. చాలా దేశాలు నగరాలు లాక్ డౌన్ లో ఉన్నప్పటికి వైరస్ వేగంగానే విస్తరిస్తుంది. ప్రపంచంలో 10లక్షల మార్క్ ను క్రాస్ చేసింది కరోనా. ఇప్పటి వరకు 53వేల మంది వరకు మరణించారు. అయితే యూరప్ లోనే 75శాతం కరోనా భాదితులు ఉన్నారు. అమెరికాలో 1,87,302మందికి కరోనా సోకగా  3వేల800మందికిపైగా మృతి చెందారు. ఇటలీలో లక్షా10వేలమంది వ్యాది బారిన పడగా 13వేల మంది మృతి చెందారు. స్పెయిన్ లో 1లక్షా 2వేలమందికి వ్యాది సోకగా 9వేల మంది మృతి చెందారు. భారత్ లో కూడా డిల్లీ మర్కజ్ ఘటనతో పెద్ద సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. 2500మందికి కరోనా సోకగా 70మందికి పైగా మృతి చెందారు.