హైదరాబాద్ లో భారీ వర్షాలు.....

  ఓ వైపు భాగ్యనగరంలో బోనాలు సందడి నెలకొంటే.. మరోవైపు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జంటనగరాల్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, ముషీరాబాద్, పాత బస్తీ, దిల్ షుక్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ ఎంసి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.