హైదరాబాద్ మెట్రో కు నాలుగేళ్లు..

 

నాలుగేళ్ల మెట్రోరైల్:

                         నాలుగేళ్ల క్రితం హైద‌రాబాద్ కు ప‌రిచ‌యం అయ్యింది న్యూ ట్రాన్స్ పోర్టు మోడ‌ల్.  ఎలాంటి ర‌ణ‌గోణ ద్వ‌నులు లేకుండా ట్రాఫిక్ లో చిక్కుకోకుండా భాగ్య‌న‌గ‌రంలో ఆకాశ ప్ర‌యాణం అందుబాటులోకి తెచ్చింది ఎల్ అండ్ టి సంస్థ మెట్రో రైల్. కూల్ అండ్ ఫాస్ట్ జ‌ర్నీని సిటిజ‌న్స్ కు ప‌రిచయం చేసింది. అప్ప‌టి వ‌ర‌కు జ‌ర్నీ అంటే అమ్మో అనేవాళ్లు...., ఇప్పుడు హాయిగా ఆకాశ మార్గాన‌ ప్రయాణం చేస్తున్నారు. మహిళలకు..., వృద్దులకు పిల్లలకు ఎంతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పరిచయం చేసింది. ఒక సారి కోత్తపేట్ నుండి గర్బిణి మహిళను మియాపూర్ వరకు తరలించారు. తరువాత నాగోల్ నుండి జూబ్లీ హిల్స్ వరకు గుండేను తరలించి మెట్రో తన ప్రత్యేకతను చాటుకుంది. మెట్రో స్టేషన్లు.., రైళ్లు  ప్రతి అనువు కెమెరా సర్వలెన్స్ లో ఉండటం వల్ల ఎలాంటి వస్తువులు మిస్సింగ్ అయినా అవి ప్రయాణిలకు దోరుకుతున్నాయి. ఎవరైనా మిస్ బిహెవ్ చేసినా నెక్ట్స్ విజిట్ లో వారిని గుర్తిస్తున్నారు.  సేవల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. హైద‌రాబాద్ మెట్రో ప‌రుగులు నాలుగేళ్లు పూర్తి చేసుకున్నాయి... 67 కిలో మీట‌ర్ల‌మేరా న‌డుస్తున్న మెట్రో..,   ప్రతి రోజు 780 ట్రిప్పులతో..,  18వేల కిలో మీటర్లు తిరుగుతున్నది. లక్షల మంది  ప్ర‌యాణికులను త‌మ  గ‌మ్య‌స్థానాల‌కు చెర్చుతుంది.  హైద‌రాబాదీలకు  కూల్  జ‌ర్నీ  ప‌రిచ‌యం చేసి ర‌య్యిమంటూ దూసుకేల్లే సౌక‌ర్యాన్నించింది.  ఎన్నో కోత్త హాంగుల‌తో సిటికి  వ‌చ్చిన మెట్రో.....  అప్పుడ‌ప్పుడు అంత‌రాయాలు...., కరోనా కష్టాలు మెట్రోకు నష్టాలు తెచ్చాయి.   బాగ్య‌న‌గ‌ర  వాసుల  ప్ర‌యాణంలో వేగాన్ని పెంచింది.   

 

                  హైద‌రాబాద్ న‌గ‌రంలో మూడు ప్ర‌దాన మార్గాల్లో 72కిలో మీట‌ర్ల మెట్రోకి శ్రీకారం చుట్టింది అప్ప‌టి ప్ర‌భుత్వం.  మియా పూర్ నుండి  ఎల్బీన‌గ‌ర్ వ‌ర‌కు కారిడార్ వ‌న్ లో 29కిలో మీట‌ర్లు...,  కారిడాద‌ర్ టూ లో నాగోల్ నుండి హైటెస్ సిటి రాయ‌దుర్గ్ వ‌ర‌కు  28కిలో మీట‌ర్లు ..., కారిడార్ త్రీలో జేబిఎస్ నుండి ఫ‌ల‌క్ నూమా వ‌ర‌కు  15కిలో మీట‌ర్ల మేర మెట్రోను ప్ర‌తిసాధించారు. నాగోల్ నుండి అమీర్ పేట్ వరకు 16.8కిలో మీటర్లు.., అమీర్ పేట్ నుండి మియాపూర్ వరకు 11.3కిలో మీటర్ల మార్గాన్ని నవంబర్ 29.., 2017లో   ప్రదాన మంత్రి నరేంద్రమోడి ప్రారంభించారు.  అమీర్ పేట్ నుండి ఎల్బీ నగర్ వరకు 16.8కిలో మీటర్ల మార్గాన్ని సెప్టంబర్ 24 2018లో అప్పటి గవర్నర్ నరసింహ్మన్ ప్రారంభించారు. అమీర్ పేట్ నుండి హైటెక్ సిటి వరకు 8.5కిలో మీటర్ల మార్గాన్ని 2019 మార్చి 20న గవర్నర్ నరసింహ్మన్ ప్రారంభించారు. హైటెక్ సిటి నుండి రాయదుర్గం వరకు 1.5కిలో మీటర్ల మార్గాన్ని 2019 నవంబర్ 29న మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. జేబిఎస్ నుండి ఎంజీ బిఎస్ వరకు 11కిలో మీటర్ల మార్గాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ 2020 ఫిబ్రవరి 7న ప్రారంభించారు.   దాంతో మొత్తంం 67కిలో మీటర్ల వరకు సిటిలో మెట్రో అందుబాటులోకి వచ్చింది.   సిటిలో మెట్రోకు రద్దీ  రోజు రోజుకు పేరుగుతూ వచ్చిన పేరుగుతూ వచ్చింది.   పిక్ అవర్స్ లో ప్రతి మూడు నిముషాలకు సాదారణ సమయాల్లో ప్రతి ఆరు నిముషాలకు ఒక రైలును నడుపుతువచ్చారు మెట్రో అధికారులు. అలా  కరోనా ప్రారంభానికి ముందు ప్ర‌తి రోజు 4 లక్షల 50వేల  మంది  సిటిజెన్స్ ను తమ తమ గమ్యస్థానాలకు  చెర్చింది. అయితే ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది. కరోనా తరువాత మెట్రో రద్దీలో భారీ మార్పులు వచ్చాయి. కరోనా భయంతో ప్రయాణికులు మెట్రోకు దూరమయ్యారు.

 

                 హైదరాబాదీల ప్రయాణ వేగాన్ని పెంచిన మెట్రో రైల్ చిన్ని చిన్న లోపాలు  అప్పుడప్పుడు బయటపడుతున్నాయి.  దాంతో  ఒక్కసారిగా టెన్షన్ కు లోనవుతున్నారు ప్రయాణికులు. పార్కింగ్ ఇబ్బందులు..., కనెక్టివిటి కష్టాలు ఇంకా మెట్రోను వెంటాడుతున్నాయి.  ఒకవైపు ప్రజా రవాణ అనిచెబుతూ వస్తున్న అధికారులు..., రియాలీటి మోడల్ మెట్రో నిర్మాణంగా చెప్పారు. 45శాతం ఆదాయం టికెటింగ్ ద్వారా.., 50శాతం ఆదాయం రియాలిటి అభివృద్ది ద్వారా మరో 5శాతం ఆదాయం ప్రకటణల ద్వారా వస్తుందని అంచనా వేశారు. పరిస్థితులు చక్కబడకపోవడంతో ఆర్థిక కష్టాల్లో కోట్టుమిట్టాడుతుంది హైదరాబాద్ మెట్రో రైల్.

 

 

 హైదరాబాద్ ప్రయాణ వేగం పేరిగింది:

                 చారిత్రక హైదరాబాద్ సిటిలో అంత్యంత వేగవంతమైన ప్రయాణం మెట్రో  అందుబాటులోకి తెచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గంటల ప్రయాణాన్ని  నిముషాల్లోకి మార్చింది. రణగోణ ద్వనులకు స్వస్తి పలికింది. మండే ఎండల్లోనూ కూల్ జర్నీని అందిస్తుంది. టైంకు డెస్టినేషన్ రీచ్ చేస్తుంది. అయితే అప్పుడప్పుడు ప్రయాణికులకు జలక్ ఇస్తుంది మెట్రో. సాంకేతిక కష్టాలు మెట్రోను వెంటాడుతున్నాయి. కోన్ని సందర్బాల్లో మెట్రో ట్రాక్ పై నిలిచిపోవడం..., ముందుకు సాగకపోవడంతో ట్రాక్ మద్యలో దింపి ప్రయాణికులకు స్టేషన్లోకి నడిపించిన సందర్బాలు  ఉన్నాయి. ఇక సిగ్నలింగ్..., విద్యుత్ సమస్యలతో మెట్రో ట్రాక్ పైనే నిలిచిపోయింది. వర్షాకాలంలో ప్లెక్సీలు తెగిపడి మెట్రో రన్ ను అడ్డుకున్నాయి. మెట్రో రైల్ చరిత్రలో అమీర్ పేట్ ప్రమాద ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. స్టేషన్ వద్ద పెచ్చులూడి పడిన ఘటనలో మహిళ మృతిచెందింది. నిర్వహణ లోపం కారణంగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయని అబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోంత మంది మెట్రో స్టేషన్ల నుండి దూకి ఆత్మహత్యలకు ప్రయత్నించడం కూడా భద్రతా లోపాలను ఎత్తి చూపుతుంది. గతంలో కోత్తపేట్ స్టేషన్ పై నుండి ద ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేయగా..., ఇటివల అమీర్ పేట్ లో ఆత్మహత్యాయత్నం చేసిన యువతి మృతి చెందింది.

 సమస్యలు వెంటాడుతున్నాయి:

            2020 మార్చిలో లాక్ డౌన్ కంటే ముందు  దాదాపు నాలుగున్నర  లక్షల ప్రయాణికులకు సేవలందించిన మెట్రోకు కరోనా కష్టాలు  తెచ్చిపెట్టింది. రద్దీ భారీగా తగ్గిపోయింది.  ప్రస్తుతం సాదరణ పరిస్థితులు నెలకోన్ని ఇప్పటికి రద్దీ పేరగడం లేదు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యాక లాక్ డౌన్ రిలాక్సియేషన్ కల్పించినప్పుడు ప్రారంభంలో ప్రతి రోజు 6వేల మంది ప్రయాణం చేశారు తరువాత మెళ్లమెల్లగా రద్దీ ఇంక్రిజ్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం సిటిలో సాదరణ పరిస్థితులు నెలకోన్నాయి. పౌరులందరూ అన్ని విదాల పనులు.. వ్యాపారాలు చేస్తున్నారు. కాని ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో అన్ని రైళ్లు..., సరైన ట్రిప్పులు తిరుగుతున్పప్పటికి కేవలం 2.30లక్షల మంది మాత్రమే ప్రయాణి చేస్తున్నాయంటున్నాయి మెట్రో వర్గాలు. అయితే త్వరలో పేరుగవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాలుగు ఏళ్లు అవుతున్నా    మెట్రోకు స్టేషన్ల వద్ద పార్కింగ్ సమస్యలు వెంటాడుతున్నాయి. రోడ్లపై పార్కింగ్ చెసుకోవాల్సి వస్తుంది ప్రయాణికులు. కోన్ని ప్రాంతాల్లో స్టేషన్ల వద్ద పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించిన నిర్మాణాలు పూర్తి కాలేదు. మూడేళ్ల క్రితం చెపట్టిన నాంపల్లి పార్కింగ్ కాప్లేక్స్ ఇప్పటికి అందుబాటులోకి రాలేదు. అయితే కోన్ని ప్రాంతాల్లో బారీ మాల్స్ నిర్మించిన అది మాల్ పార్కింగ్ మాత్రమే అవుతుందంటున్నారు నిపుణులు.  అంతే కాకుండా కనెక్టివిటి  కష్టాలు   ఇంకా తీరలేదు. ప్రత్యేక బస్సులు ఎర్పాటు చేస్తామని చెప్పినప్పటికి అది ఎక్కడ అందుబాటులోకి రాలేదు. దాంతో  ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనేక్టివిటి చాలా స్టేషన్ల వద్ద పెద్ద సమస్య అయ్యింది.

                 కరోనా తరువాత హైదరాబాద్ లో వ్యక్తి గత వాహనాల వాడకం పేరిగింది. మెట్రో వస్తే నగరంలో పూర్తిగా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తారని ప్రకటించారు అప్పటి అధికారులు కాని పరిస్థతి అలా జరగలేదని అప్పుడు వారు తప్పుడు ప్రకటణలు చేశారంటున్నారు నిపుణులు అధికారుల అంచనాలకు ప్రస్తుతం ఉన్న రద్దీకి ఎక్కడ పోంతన లేకపోవడమే అందుకు కారణం అంటున్నారు . రోడ్లపై రద్దీ తగ్గుతుంది. కాలుష్యం తగ్గుతుందని ప్రకటించారు అప్పట్లో అధికారులు. అయితే రోడ్లపై వాహనాల రద్దీ తగ్గలేదని..., హైదరాబాద్ లో పబ్లీక్ తగ్గలేదని అయినా మెట్రోకు రద్దీ రాకపోవడానికి కారణం అధికారులు తప్పుడు అంచనాలు వేయ్యడం అబద్దాలు చెప్పడమే అంటున్నారు.

 

ఆర్థిక కష్టాలు:

              సిటి మెట్రో ప్రాజెక్టుకు దాదాపు 3వేల 7వందల కోట్ల వ్యయం అధికంగా అవ్వడంతో ప్రాజెక్టు మొత్తం కాస్ట్ 21వేల 919కోట్లకు పేరిగింది. ఇందులో 4వేల 5వందల కోట్ల వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భరించగా మిగిలిందంతా ఎల్ అండ్  టి మెట్రో సంస్థ ఖర్చు చేసింది.  గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో బారీగా నష్టాలు వచ్చినట్లు చెబుతున్నాయి మెట్రో వర్గాలు. ఇక కరోనాతో తమ ఆర్థిక పరిస్థితి మరింత గా దిగజారిపోతుందంటున్నాయి మెట్రో వర్గాలు.  తమకు సాఫ్ట్ లోన్ ఇచ్చి ఆదుకోవాలంటూ విజ్నాప్తి చేస్తున్నాయి ఎల్ అండ్ టి మెట్రో వర్గాలు. అయితే మెట్రో   ప్రయాణికుల ద్వారా 45శాతం ఆదాయం... ప్రకటణల ద్వారా 5శాతం ఆదాయం.., రియాలిటి ద్వారా 50శాతం ఆదాయం రాబట్టుకోవాల్సి ఉంది. అయితే ప్రకటణ ద్వారా వచ్చే ఆదాయం కూడా పెద్దగా రావడం లేదు ఎక్కడ చూసిన ప్రకటన బోర్డులు ఖాళీగా ధర్శనమిస్తున్నాయి.  రియాలీటిలో మొత్తం  180 లక్షల చదరపు అడుగుల పరిదిలో నిర్మాణాలు చేసి వాటిని 60ఎళ్లపాటు లీజుకు ఇవ్వడం ద్వారా ప్రతి యేటా ఆదాయం పోందవచ్చు ఎల్ అండ్ టి మెట్రో సంస్థ. దాంతో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండవచ్చనేది ఒప్పందం. కాని ఇప్పటికి ఎల్ అండ్ టి 18 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్సెష్ ను మాత్రమే నిర్మించినట్లు లెక్కలు చెబుతుంది.  అంటే లక్ష్యంలో 10శాతం మాత్రమే రీచ్ అయ్యింది. మెట్రో అందుబాటులోకి వచ్చేనాటికి 60లక్షల చదరపు అడుగుల వాణిజ్య నిర్మాణం అందుబాటులోకి తెస్తామని అప్పట్లో మెట్రో వర్గాలు చెప్పుకోచ్చాయి.  దాంతో ఆదాయం తగ్గి మెట్రో ఆర్థిక కష్టాల్లో పడిందంటున్నారు నిపుణులు...
 
                
నాలుగేళ్ల మెట్రో ఎన్నో ఒడిదోడుకులు ఎదుర్కోన్నది. అయితే అధికారులు చెప్పినట్లుగా లక్షలాది మంది ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా నగరంలో ఉన్న ఉన్నతమైన ప్రయాణ సౌకర్యాన్ని పబ్లీక్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోనే విధంగా  చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే హైదారబాద్ లో మెట్రో ఉన్నా రోడ్లపై అలానే రద్దీ పేరిగి...,పోల్యుషన్ తగ్గకుండా ఉండటం వల్ల రాబోయే రోజుల్లో హైదారబాద్ నగరానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు.