హైదరాబాద్ ను క్లీన్ గా ఉంచుదాం

హైదరాబాద్ ను క్లీన్ గా ఉంచుదాం

             జిహెచ్ఎంసిలో  పట్టణ ప్రగతి కార్యక్రమాలను అధికారులు ప్రజా ప్రతినిధులు విజయవంతం చేయాలని జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కోరారు. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా   తార్నాక డివిజన్ లాలాపేట సత్య నగర్ లో   డిప్యూటి మేయర్ పర్యటించారు.  పట్టణ అభివృద్ధి కమిటీల్లో  యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు శ్రీలత శోభన్ రెడ్డి. పట్టణ ప్రగతి లో ప్రజలకు సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఇంటింటికి  నీటి సరఫరా అయ్యే విధముగా అధికారులు చొరవ తీసుకోవాలని లో ఫ్రెషర్ ఇతర సమస్యలు లేకుండా చూడాలన్నారు. రోడ్డు ప్రక్కన, ఖాళీ స్థలాల వద్ద  ప్రభుత్వ స్థలాల్లో  తప్పకుండా మొక్కలు నాటాలని కోరారు.హరితహారం కార్యక్రమం తో తెలంగాణ లోని జాతీయ రహదారులు, ఇతర రహదారులు హరిత శోభను సంతరించుకున్నాయని, ఎంత చూసినా చూడాలనిపించే విధంగా హరిత శోభ ఉందన్నారు. పట్టణ ప్రగతి లో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి భావితరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించాలని హైదరాబాదీలకు పిలుపునిచ్చారు.