హైదరాబాద్  మెట్రో రెండవ స్థానం..       

       రైడర్ షిప్ లో హైదరాబాద్  మెట్రో రెండవ స్థానం              

                     గ్రేటర్ హైదరాబాద్ మెట్రోకు రద్దీ క్రమ క్రమంగా పెరుగుతుంది. అన్ లాక్ డౌన్ లో భాగంగా సెంప్టంబర్ 7 ను మెట్రో సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. మొదటి వారంలో 30వేలుగా ఉన్న రైడర్స్ క్రమంగా పెరుగుతూ  రెండు నెలల తరువాత లక్షా 30వేలకు చేరింది. దేశంలో డిల్లి మెట్రో తరువాత రైడర్ షిప్ లో ప్రస్తూతం రెండవ స్థానంలో ఉంది హైదరాబాద్ మెట్రో.    హైదరాబాద్ మెట్రో లాక్ డౌన్ కు ముందు 4లక్షలకు పైగా ప్రతి రోజు సిటిజన్స్ ను తమ తమ గమ్యస్థానాలకు చెరవేసింది. అయితే లాక్ డౌన్ కారణంగా దాదాపు ఐదున్నర నెలల తరువాత సెంప్టంబర్ 7వ తేదినా ప్రారంభం అయ్యింది. మొదట్లో చాలా తక్కువ మంది  ప్రయాణం చేశారు. వారం రోజుల్లో 30వేలకు ప్రయాణికుల సంఖ్య చెరింది.  గతనెలలో క్యాస్ భ్యాక్ అఫర్లు.., ట్రిప్ ఆఫర్లు ప్రకటించడంతో మెట్రోకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది ప్రస్తుతం ఆ సంస్య 1లక్షా 30వేలకు చెరిందంటున్నాయి మెట్రో వర్గాలు. 

 

                  దేశంలోని  9మెట్రోల్లో డిల్లీ తరువాత హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ప్రయాణికులు మెట్రోను అశ్రయిస్తుననారు. డిల్లిలో ప్రతి రోజు పద్నలుగున్నర లక్షల మంది వరకు ప్రయాణం చేస్తుంటే హైదరాబాద్ నగరంలో 1లక్షా 30వేలవరకు సరాసరిగా ప్రయాణం చేస్తున్నారు. శనివారం రోజు  14, 79, 300మంది డిల్లీ మెట్రోలో ప్రయాణం చేయ్యగా.., హైదరాబాద్ మెట్రోలో 1,33, 974మంది ప్రయాణం చేశారు. ఇక  బెంగుళూర్ మెట్రో లో 68,716 మంది..., ముంబాయి మెట్రోలో 32,322మంది...,  చైన్నై మెట్రో లో 29, 141మంది...., జైపూర్ 20,160 మంది..., కోచ్చి మెట్రోలో 11,106మంది...,  నాగ్ పూర్ 4,051 మంది..., లాక్నో 2,020మంది ప్రయాణం చేశారు.   డిల్లి మెట్రో మొత్తం 389 కిలో మీటర్లు అంటే ప్రతి కిలో మీటర్ కు సరాసరిగా  ఇప్పుడు  3,802 మంది ప్రయాణం చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.  హైాదరాబాద్ మెట్రో లో మాత్రం కిలో మీటర్ కు 1941మంది ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి.