సుస్తీకి బస్తీ దవాఖనతో స్వస్తీ..

 

               హైదరాబాద్ లో మెరుగైన వైద్య సేవలు ఆయా ప్రాంతాల్లో  అందించేందుకు బస్తీ దావఖానాలను అందుబాటులోకి తెస్తుంది ప్రభుత్వం.    ఇప్పటి వరకు ఉన్న 226 ఆసుపత్రుల కు తోడు  ఈరోజు  గ్రేటర్ లో మరో 32 బస్తీ దవఖానాలు అందుబాటులోకి వచ్చాయి.  జిహెచ్ఎంసి పరిదిలో మంత్రు  కేటిఆర్.., హారిష్ రావు.., తలసాని.., మల్లారెడ్డి.., మహమూద్ అలీ..తోపాటు నగరానికి చెందిన   ఎమ్మెల్యేలు.., ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.  

          హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తి దావఖానాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.  తొలిదశలో   ప్రారంభించిన బస్తీ దవాఖానాలు సత్ఫలితాలు ఇస్తుండటంతో అంచలంచెలుగా వాటిని విస్తరిస్తున్నారు అధికారులు.  ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 226 బస్తి దావఖానాలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.  దవాఖానాలో ప్రభుత్వం నాణ్యమైన సేవలు అందించడంతో, వాటికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.   హైదరాబాద్ నగరంలోని పేదలుండే చోటనే, పలు బస్తీల్లో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాల ద్వారా స్థానికంగా ఉన్న పేద ప్రజలకు వైద్య ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక సేవలు ఉచితంగా అందుతున్నాయి. బస్తీ దవాఖానలలో ప్రస్తుతం ఒక్కోదానికి కనీసం 100 మంది వరకు ఇన్ పేషెంట్ సంఖ్య ఉందని మొత్తంగా సుమారు 226 ద్వారా ప్రతి రోజూ సరాసరి 25 వేల మందికి సేవలు అందుతున్నాయని అంటున్నాయి వైద్యశాఖ వర్గాలు.   పేద ప్రజలు ఉన్న ప్రతి డివిజన్ లోనూ బస్తి దావఖాన ఉండాలన్నదే తమ లక్ష్యమని, అవసరమైన చోట్ల రెండు లేదా అంతకు మించి కూడా ఏర్పాటు చేయాలని గతంలో మంత్రి  కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.   దాంతో ఈరోజు  మరో 32 ఆసుపత్రులను ప్రారంబించారు ప్రజా ప్రతినిధులు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారిష్ రావు ఒల్డ్ బోయిన్ పల్లిలో.., మంత్రి కేటిఆర్ షేక్ పేట్ లో.., మల్లారెడ్డి చింతల్లో.., తలసాని బేగంపేట్ మరియు  దూల్ పేట్ లో..., మహమూడ్ అలీ పూరాన పుల్ లో డిప్యూటి స్పీకర్ పద్మారావు మెట్టుగుడా వద్ద బస్తీ దావఖనాలను ప్రారంబించారు.  

 

         గ్రేటర్ హైద్రాబాద్ పరిదిలో ఏర్పాటు చేసిన బస్తి దావఖనాలు పేదలకు మంచి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాయన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.  జిహెచ్ఎంసి పరిదిలో మొత్తం 350బస్తి దావఖనాల ఎర్పాటు కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని ఇప్పటి వరకు 258అందుబాటులోకి వచ్చాయన్నారు. బస్తి దావఖానాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని అందువల్ల కోన్ని ప్రాంతాల్లో రెండు వందల వరకు కూడా పెషేంట్లు వస్తున్నారని.., చాలా ప్రాంతాల్లో టెలిమెడిషిన్ కూడా అందుబాటులో ఉందన్నారు మేయర్. రాబోయే రోజుల్లో మరిన్ని సెంటర్లు అందుబాటులోకి తెచ్చేలా చూస్తామన్నారు మేయర్ విజయలక్ష్మి.