సి.ఎం చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

సి.ఎం చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం.

కార్మికుల ప్రోత్సాహం ఇవ్వడం సరైన చర్య - మేయర్

                 అభివృద్ది చెందిన దేశాల‌ను కూడా గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న కోవిడ్‌-19 విస్త‌ర‌ణ‌ను అరిక‌ట్టేందుకు జిహెచ్‌ఎంసి శానిటేష‌న్ కార్మికులు చేస్తున్న కృషి అమూల్య‌మ‌ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ పేర్కొన్నారు. కార్మికుల శ్రమను గుర్తించిన ముఖ్యమంత్రి  ప‌ది శాతం వేత‌నాన్ని కూడా మంజూరు చేస్తూ ప్రోత్సాహ‌కంగా   7,500రూపాయలు ప్రతి కార్మికుడికి   అద‌నంగా ఇవ్వడానికి నిర్ణయించడం సంతోషమన్నారు.   ముఖ్య‌మంత్రికి ప్ర‌త్యేక ద‌న్య‌వాదాలు తెలిపుతున్నామన్నారు మేయర్.  జిహెచ్‌ఎంసిలో ప‌నిచేస్తున్న దాదాపు 27వేల మంది శానిటేష‌న్‌, ఎంట‌మాల‌జి, డి.ఆర్‌.ఎఫ్ కార్మికులకు ఈ చర్యతో లబ్ది చేకురుతుందన్నారు. 

                   జిహెచ్‌ఎంసి హెడ్ ఆఫీస్‌లో మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ స‌మ‌క్షంలో శానిటేష‌న్‌, ఎంట‌మాల‌జి, డి.ఆర్‌.ఎఫ్ కార్మికులు సి.ఎం చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. వైద్యులు, పోలీసుల‌తో పాటు శానిటేష‌న్ కార్మికులు, స్ప్రేయింగ్ చేస్తున్న ఎంట‌మాల‌జి, డి.ఆర్‌.ఎఫ్ సిబ్బంది అంకిత‌భావంతో ప‌నిచేస్తున్నార‌ని ప్ర‌శంసించారు మేయర్. చిత్త‌శుద్దితో ప‌నిచేస్తున్న ప్ర‌తి ఉద్యోగి కృషిని ముఖ్య‌మంత్రి గుర్తించి, ప్రోత్స‌హిస్తార‌ని తెలిపారు.