సమస్యలు పరిష్కారానికి బల్దియా ముట్టడి.

 

                  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రదాన కార్యాలయాన్ని ముట్టడించారు బిజేపి కార్పోరేటర్లు... కార్యకర్తలు. పాలకమండలి సమావేశం నిర్వహించాలని..., కార్పొరేటర్లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నినాధాలు చేశారు.  పెద్ద ఎత్తున కార్యకర్తలు  మేయర్ ఛాంబర్..,  కమీషనర్ చాంబర్ వద్ద నిరసన తెలిపారు. మేయర్ చాంబర్లో చోచ్చుకుపోయిన బిజేపి శ్రేణులు పూలకుండీలు..., జిహెచ్ఎంసి బోర్డులను ద్వంసం చేశారు. బిజేపి కార్పోరేటర్ల చర్యలను ఖండించారు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి..
 

                   గ్రేటర్  హైదరాబాద్ పాలకమండలి నిర్వహించకపోవడంపై బిజేపి కార్పోరేటర్లు  మండి పడ్డారు. నగరంలో ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం లేకుండా మేయర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రెండు సార్లు మేయర్ కు విన్నవించినా స్పందించకపోవడంతో  దర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు మేయర్. అయితే అధికారులు మేయర్ కార్యాలయం నుంచి స్పందన రాలేదని మండి పడ్డారు.  

 

           బిజేపి కార్యకర్తలు జిహెచ్ఎంసి మేయర్  చాంబర్ వద్ద చేసిన ఆందోళనలో  పూలకుండిలను.., మేయర్ బోర్డును కార్యలయంలో కోన్నివస్తువులను ధ్వంసం అయ్యాయి.  బిజేపి శ్రేణులను పోలిసులు అరెస్టే చేయ్యడం ప్రారంబించడంతో పరిస్థిితి మరింత ఉదృక్తంగా  మారింది. జిహెచ్ఎంసి పాలకమండలి సమావేశం నిర్వహించకపోవడంతో తమ ప్రాంతాల్లో సమస్యలు చర్చించేందుకు అవకాశం లేకుండా పోయిందని మండి పడ్డారు బిజేపి కార్పోరేటర్లు. ఎడాదిగా తమ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. నిరసన కార్యక్రమం రసాబసాగా మారడంతో  పలువురు కార్పోరేటర్లును... బిజేపి కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలిసులు. ముందస్తు సమాచారం లేకపోవడంతో ఎక్కువ మంది కార్యకర్తలు రావడంతో వారిని కంట్రోల్ చేసేందుకు సాద్యం కాలేదు పోలిసులకు. దాంతో మేయర్ చాంబర్లోకి చోచ్చుకేళ్లారు కార్పోరేటర్లు కార్యకర్తలు. నిదులు విడుదల చేయ్యాలని సమస్యలు పరిష్కరించాలని పోస్టర్లు బల్దియా కార్యాయంతోపాటు మేయర్ చాంబర్లో అంటించారు. అయితే పోలిసులు అరెస్టే చేసిన తీరుపై కార్పోరేటర్లు మండి పడ్డారు.

 

               బిజేపి కార్పోరేటర్ల చేసిన నిరసన సరైన పద్దతిలో లేదన్నారు జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి. బిజేపి శ్రేణులు ద్వం సం చేసింది మేయర్ ప్రాపర్టీ కాదని..., అది పబ్లీక్ ప్రాపర్లీ అన్నారు. బిజేపి రాయకీయ దురుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేసిందన్నారు. చాలా సార్లు బిజేిపి కార్పోరేటర్ల డివిజన్లలో పర్యటించి  సమస్యల పరిష్కారానికి తాను కృషి చేశానని..., సమస్యలపై అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాని..., ప్రజా ఇబ్బందుల పరిష్కారానికి తన దగ్గరికి వచ్చిన కార్పోరేటర్లు సంతోషంగా తిరిగి వెళ్లిన అంశాన్ని ఆమె గుర్తు చేశారు. ఇది కార్పోరేటర్లు చేసిందా.., లేక బిజేపి హైకామాండ్ చేబితే చేశారా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు మేయర్. వరుసగా ఎన్నికల కోడ్ రావడంతోనే తాము పాలకమండలి సమావేశాలు నిర్వహించలేదని చెప్పుకోచ్చారు. జిహెచ్ఎంసికి స్వచ్ సర్వేక్షన్ లోనూ మంచి గుర్తింపు వచ్చిందని అందుకే  ఒర్వలేక ఇలాంటి పనులు చేశారు అని అన్నారు మేయర్ విజయ లక్ష్మి..

   

జిహెచ్ఎంసి కార్యాలయంలో బిజేపి కార్పోరేటర్లు చేసిన ఆందోళన చిలికి చిలికి గాలివానగా మారుతుందా..., లేదా    బిజేపి - టీఆర్ఎస్ రెండు పార్టీలు  ఈ అంశాన్ని ఎంతవరకు తీసుకువెళ్తాయో చూడాలి.