వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టో

  •  'రెండు లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీ ... మూడు దశల్లో మద్య నిషేధం'

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామని వైసీపీ అధినత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీడీపీ గత ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోను వారి వెబ్‌సైట్‌లో పెట్టి తీసేశారని, అందులో సగం హామీలను కూడా నేరవేర్చలేదు విమర్శించారు. మేనిఫెస్టో అంటే కులానికో పేజీ కేటాయించడం కాదని అన్నారు.

వైసీపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు:

  • ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు చెల్లింపు. పంట వేసే సమయానికి అంటే ప్రతి మే నెలలో రూ.12,500 చొప్పున అందజేత
  • రైతులకు వడ్డీ లేని రుణాలు
  • వ్యవసాయానికి పగటి పూట 9 గంటల కరెంట్
  • రైతులకు ఉచితంగా బోర్లు వేయించడం
  • పంటల బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది
  • రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
  • పేద,మధ్య తరగతి వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ భారీ వైద్య పథకం
  • 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఉచిత వైద్యం అందేలా పథకం
  • హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం
  • ప్రమాదవశాత్తు రైతు చనిపోతే బీమా రూ. 7లక్షలు
  • సహకార డెయిరీకి పాలుపోసే పాడి రైతుకు లీటరుకు రూ.4 సబ్సిడీ
  • కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేలా చట్టసవరణ
  • బీసీ, మైనార్టీ కౌలు రైతులకు రూ.12,500 పెట్టుబడి సాయం
  • తలసేమియాలాంటి వ్యాధితో బాధపడుతున్న వారికి రూ.10వేల పెన్షన్
  • ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపు
  • దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10 వేలు పింఛన్
  • అమ్మఒడి పథకం ద్వారా పిల్లలను బడులకు పంపే తల్లులకు రూ.15 వేలు చెల్లింపు
  • 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ. 75 వేలు
  • పింఛన్ వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు
  • డబ్బులు అవసరమైన ఇంటి మీద పావలా వడ్డీకే రుణాలు
  • పోలవరం సహా అన్ని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి
  • ప్రత్యేకహోదా సాధనకు అలుపెరగని పోరాటం
  • గ్రామ సచివాలయం ద్వారా ఆ గ్రామంలోని 10 మందికి ఉద్యోగాలు
  • 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నియమాకం. .అన్ని పథకాలను ఆ వాలంటీర్ ద్వారా డోర్ డెలివరీ
  • ఏ సమస్య అయినా 72 గంటల్లోనే పరిష్కారం
  • ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా క్యాలెండర్ విడుదల
  • 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీ
  • పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం
  • ప్రభుత్వ కాంట్రాక్టర్లను నిరుద్యోగులకు ఇచ్చేలా చట్టం
  • మూడు దశల్లో మద్యాన్ని నిషేధం
  • అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు - 13 లక్షల మందికి వెంటనే పరిహారం
  • తిరుమలలో స్వామివారి తలుపులను సన్నిథిగొల్లలు తెరిచే సంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించడం
  • 18-60 ఏళ్లలోపు ఏ పౌరుడైనా సహజ మరణం సంభవిస్తే వైఎస్ఆర్ జీవన పథకం కింద రూ. లక్ష అందజేత
  • ఆటో కార్మికులకు ఏడాదికి రూ. 10 వేల సాయం
  • ప్రతి స్కూళ్లోను ఇంగ్లీష్ మీడియం, తెలుగు తప్పనిసరి
  • జర్నలిస్టులకు వారి సొంత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు వారి సమస్యల పరిష్కారం
  • బీసీ హక్కులకు భంగం కలగకుండా కాపుల రిజర్వేషన్ల కోసం ప్రయత్నం
  • ఆర్య, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు
  • అర్చకులకు రిటైర్ మెంట్ విధానం రద్దు
  • మైనార్టీలకు సంబంధించిన ఆస్తులను రీ సర్వే చేయించి స్థిర ఆస్తులు డిజిటలైజ్ చేయించి ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన
  • ఇమామ్, మౌజమ్ లకు రూ. 15 వేలు
  • అన్ని అగ్రకులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు
  • ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు
  • రాజధానిని ఫ్రీజోన్ గా ఏర్పాటు చేసి అందరికీ ఉద్యోగ అవకాశాల కల్పన
  • సీపీఎస్ రద్దు .. పాత పెన్షన్ విధానం అమలు