విపత్తుల రక్షణ దళం - DRF

               దేశంలో మరే నగరానికి లేని విధంగా  హైదరాబాద్ కు విపత్తుల నివారణ దళం ఉంది. అదే జిహెచ్ఎంసి డిజాస్టార్ రెస్పాన్స్ ఫోర్స్. 2018 ఆగస్టు 11 న మంత్రి చేతుల మీదుగా ఈ ఫోర్స్ అందుబాటులోకి వచ్చింది. యువ ఐఎఎస్ ఆఫిసర్ విశ్వజిత్ కంపాటి ఆద్వర్యంలో పనిచేస్తున్న ఈ వింగ్ లో దాదాపు 4వందల మంది సుశిక్షితులైన సిబ్బంది 24గంటలపాటు 365రోజులు అందుబాటులో ఉన్నారు. వర్షం వచ్చి నివాస ప్రాంతాలు మునిగిపోయినా..., నిర్మాణాలు కూలి ప్రజలు సమస్యల్లో ఉన్నా.., నాలాలు, మ్యాన్ హోల్స్ ప్రజలు పబ్లీక్ పడ్డా రెస్కూ చేయ్యాడానికి నగరంలో ముందుగుర్తు వచ్చే పదంగా మారిపోయింది జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్.

 

           వర్షం వచ్చిందంటే చాలా నగరంలో ఎక్కడ సమస్య వచ్చిన సమాచారం వచ్చిన ఐదు.., పది నిముషాల్లో ఘటన స్థలానికి చెరుకుంటారు. అక్కడ అసరమైన చర్యలు తీసుకుంటారు. గతంలో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు వచ్చాయంటే చాలు NDRF సిబ్బంది వచ్చే వరకు నీటిలోకి వెళ్లే వారే లేరు. కాని ప్రస్తుతం పరిస్థితి అంతా మారిపోయింది. ఎంత వరదైలైన మరేంతటి విపత్తులైనా టీం అక్కడికి రీచ్ కావడమే  లేటు పని ప్రారంభిస్తారు. అవకాశం ఉన్న మేరకు ప్రాణాలు నిలబెడుతారు. 

 

               వరుసగా వచ్చిన విపత్తుల సందర్బాల్లో అనేక మందిని రెస్క్యూ చేసి ప్రాణాలు కాపాడారు డిఆర్ఎఫ్ సిబ్బంది. ప్రదానం వర్షం కాలంలో  డిఆర్ఎఫ్ టీం సభ్యులు చేసిన కృషి మరువ లేనిది. వరద నీళ్లలోనే పబ్లీక్ కు అవసరమైన సేవలు అందించారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో ఉదయం పాల దగ్గరి నుండి రాత్రి బోజనం వరకు అందించారు.   అనేక ప్రాంతాల్లో వృద్దులను పిల్లలను తమ భూజాలపై మోసుకోచ్చిన సందర్బాలున్నాయి. 

                    

                 రోడ్డుపై ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా వేంటనే స్పందించి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు శిక్షణ పోందిన సిబ్బంది. ఒపెన్ వెల్స్ లో పడ్డ జంతువులైనా..., పంతంగుల మాంజాలో చిక్కుకున్న పక్షులై తమకు సమాచారం వచ్చిందంటే చాలు వాటిని రక్షిస్తారు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది. 

 

                ఇక ప్రపంచాన్ని గడగడలాడించిన మహ్మమారి కరోన సమయంలో హైదరాబాద్ లో మేమున్నామంటూ పనిచేసింది జిహెచ్ఎంసి డిఆర్ఎప్ టీం. నగరంలో ప్రదాన రహదారులు.., గల్లీ రోడ్లలో సైతం సోడియం హైపోక్లోరైట్ ద్రవాణాన్ని విసృతంగా స్ప్రె చేయ్యడం ద్వారా ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కల్పించారు. ప్రభుత్వం, జిహెచ్ఎంసి, అధికారులు తమ కోసం  పనిచేస్తున్నారన్న నమ్మకం హైదరాబాదీలలో కలిగింది. ేనగరంలో ఉన్న అన్ని రోడ్లలో రెండు మూడు సార్లు హైపోక్లోరైట్ ద్రవాణాన్ని   స్ప్రె చేయ్యడం వల్ల ఎంతో ఉపయోగం జరిగింది. ఎక్కడ కరోనా కేసు బయటపడ్డ అప్రాంతం అంత శానిటైజ్ చేయ్యడంలో ప్రముఖ పాత్ర పోషించింది జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్.