వాహన దారులకు పోలీసుల వార్నింగ్.. ఇకపై అలాచేసారో..!

      కొంతమంది ద్విచక్ర వాహనాలు, కార్లకు నెంబర్ ప్లేట్లు తొలగిస్తే.. మరికొందరు నెంబర్ ప్లేట్లకు స్టికర్లు అంటించి యదేచ్చగా రోడ్లపై చక్కర్లు కొడుతుంటారు. ఇక ఇలాంటివారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నెంబర్ ప్లేట్ లేకపోయినా, నెంబర్లు చెరిపేసి దొరికితే చీటింగ్ కేసు నమోదు చేసి వాహనాల సీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ తరహా వాహనాలపై నగర ట్రాఫిక్ పోలీసులు నిఘా పెంచారు. డెలివరీ బాయ్స్, విద్యార్ధులు, చిరుద్యోగులు ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్లను తొలగించడం, అవి కనిపించకుండా మాస్క్ చుట్టడం వంటివి చేస్తున్నారని పోలీసులు తెలిపారు.