వాఘా-అత్తారీ సరిహద్దు బీటింగ్‌ రిట్రీట్‌ అదుర్స్

     గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాఘా-అత్తారీ సరిహద్దు ప్రాంతంలో బీటింగ్ రిట్రీట్ వేడుక మంగళవారం విశేషంగా ఆకట్టుకున్నది. ఈ పెరేడ్‌ను తిలకించేందుకు ఎప్పటిలాగానే ప్రజలు హాజరై.. భారత సైనికుల్లో ప్రేరణ నింపారు. భారత్ మరియు పాక్ దేశాల సైనికులు చేపట్టిన ప్రత్యేక కవాతును వీక్షించేందుకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు వాఘా సరిహద్దుకు చేరుకుంన్నారు. బీటింగ్‌ రిట్రీట్‌గా పిలిచే ఈ ప్రత్యేక పెరేడ్‌ను వీక్షించడం కోసం చాలా మంది ఎదురుసారు. ఒక రోజు ముందుగానే వాఘా సరిహద్దుకు చేరుకుని ఆ క్షణాల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. వాఘా-అత్తారీ సరిహద్దు ప్రాంతంలో జరిగిన బీటింగ్‌ రిట్రీట్‌లో భారత్‌, పాకిస్తాన్ దేశాల సైన్యం సంయుక్త కవాతు చేపట్టాయి. ఇక్కడ ఎప్పటిమాదిరిగానే బీటింగ్‌ రిట్రీట్‌లో రెండు దేశాల సైనికులు నువ్వా నేనా అన్నట్లు చేసే పెరేడ్‌ ఎంతో ఉద్విఘ్నంగా ఉంటుంది. రెండు దేశాల సైనికులు కొట్టుకుంటున్నారా? అన్నంత రీతిలో కవాతు ప్రదర్శన జరుగింది..